Moviesప్ర‌భాస్ ప్లాప్ సినిమా జ‌పాన్‌లో దుమ్ము రేపుతోంది.. 150 నాటౌట్‌

ప్ర‌భాస్ ప్లాప్ సినిమా జ‌పాన్‌లో దుమ్ము రేపుతోంది.. 150 నాటౌట్‌

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి 1,2 తో పాటు సాహో సినిమాల‌తో ఇంట‌ర్నేష‌న‌ల్ వైడ్‌గా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యాడు. ఈ మూడు సినిమాలు ప్ర‌భాస్ రేంజ్‌ను అమాంతం మార్చేశాయి. ఇక బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ కుర్రాడు సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో సినిమాలో న‌టించాడు. రు. 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సాహో అంచ‌నాలు అందుకోలేకపోయింది. సౌత్‌లో అంత‌గా ఆడ‌ని సాహో బాలీవుడ్‌లో మాత్రం సూప‌ర్ హిట్ అయ్యింది.

ఇదిలా ఉంటే మ‌న ద‌గ్గ‌ర ప్లాప్ టాక్ తెచ్చుకున్న సాహో ఇప్పుడు జ‌పాన్‌లో దుమ్ము రేపేస్తోంది. ఈ సినిమాను జ‌పాన్ భాష‌లోకి డ‌బ్ చేసి రిలీజ్ చేశారు. రిలీజ్‌కు ముందే టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో అక్క‌డ మంచి హైప్ తెచ్చుకున్న సాహో రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి స‌రికొత్త రికార్డుల‌తో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే సెంచ‌రీ దాటేసి 150 రోజులు కంప్లీట్ చేసుకున్న సాహో ఇంకా అక్క‌డ హౌస్ ఫుల్‌గా ర‌న్ అవుతోంది.

ఇప్పటికే ప్రభాస్ క్రేజ్ జపాన్ లో మాములుగా లేదు. జ‌పాన్‌లో సూప‌ర్ క్రేజ్ ఉన్న హీరోల‌లో సౌత్ నుంచి ర‌జ‌నీకాంత్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌ర్వాత ప్ర‌భాస్‌కే ఈ ఘ‌న‌త ద‌క్కింది. సాహో అక్క‌డ సాలిడ్ విజయంతో మరింత స్థాయికి వెళ్ళింది అని చెప్పాలి. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news