Moviesరేపు ప‌వ‌న్ బ‌ర్త్ డే ట్రిఫుల్ ధ‌మాకా... ఫ్యాన్స్ అస్స‌లు...

రేపు ప‌వ‌న్ బ‌ర్త్ డే ట్రిఫుల్ ధ‌మాకా… ఫ్యాన్స్ అస్స‌లు ఆగ‌ట్లేదుగా..!

ప‌వర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలపై గ‌తంలో లేన‌ట్టుగా వ‌రుస‌గా క్రేజీ అప్‌డేట్స్ వ‌స్తుండ‌డంతో ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. రేపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు కావ‌డంతో ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ మానియా ట్రెండింగ్ మొదలైంది. ప‌వ‌న్ గురించి ఏ చిన్న వార్త వ‌చ్చినా భారీ ట్రెండింగ్ చేసేందుకు ఫ్యాన్స్ కాచుకుని కూర్చొని ఉన్నారు. ఇక రేపు ప‌వ‌న్ సినిమాల‌కు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వ‌చ్చినా భారీ ట్రెండింగ్‌కు ప్లాన్ చేశారు.

ఇక రేపు ప‌వ‌న్ నుంచి ట్రిఫుల్ ధ‌మాకాకు రంగం సిద్ధ‌మైంది. ముందు ప‌వ‌న్ న‌టిస్తోన్న వ‌కీల్‌సాబ్ సినిమా నుంచి ఉద‌యం 9 గంట‌ల 9 నిమిషాల‌కు స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ఇది బ‌హుశా వ‌కీల్‌సాబ్ టీజ‌ర్ అంటున్నారు. ఇక రెండోది మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు క్రిష్‌తో ప‌వ‌న్ న‌టిస్తోన్న 27వ సినిమాకు సంబంధించి ఓ పోస్ట‌ర్ రానుంది.

ఇక సాయంత్రం 4.05 గంట‌ల‌కు తన బ్లాక్ బస్టర్ కాంబో హరీష్ శంకర్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక అధికారిక అనౌన్స్మెంట్ రానుంది. ఈ దెబ్బతో పవర్ స్టార్ నుంచి ట్రిపుల్ ధమాకా కన్ఫర్మ్ అయ్యిందని చెప్పాలి. ఒకే రోజు మూడు వ‌రుస బిగ్ అప్‌డేట్స్ అంటే రేపంతా ప‌వ‌న్ ఫ్యాన్స్ సంబ‌రాలు మామూలుగా ఉండ‌వ‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news