ఒక‌డే భ‌ర్త‌…. 39 మంది భార్యలు.. 94 మంది పిల్లల‌తో ఒకే ఇంట్లో…!

గ‌తంలో ఉమ్మ‌డి కుటుంబాలు ఉండేవి. అప్ప‌ట్లో మ‌హా అయితే భార్య‌, భ‌ర్త‌లు, వారి పిల్ల‌లు, మ‌న‌వ‌ళ్లు క‌లిసి 30 నుంచి 50 మంది క‌లిసి ఒకే ఇంట్లో ఉండేవారు. ఇప్పుడు చిన్న కుటుంబాలు రావ‌డంతో ఒకో ఇంట్లో న‌లుగురికి మించి ఉండ‌డం లేదు. భార్య‌, భ‌ర్త‌తో పాటు ఇద్ద‌రు పిల్ల‌లు ఉంటున్నారు. అయితే ఓ కుటుంబంలో మాత్రం ఏకంగా 181 మంద ఉంటున్నారు. మిజోరాంలోని బాట్వాంగ్ గ్రామంలో జియోనా చానా కుటుంబంలో ఇంత మంది ఉంటున్నారు.

 

అత‌డికి ఏకంగా 39 మంది భార్య‌లు ఉన్నారు. వీరికి 94 మంది పిల్ల‌లు ఉన్నారు. మొత్తం 14 మంది కుమార్తెలు, వారికి 33 మంది మనవరాళ్లు కూడా ఉన్నారు. మొత్తం అంద‌రూ 181 మంది క‌లిపి ఒకే కుటుంబంలో ఉంటున్నారు. ఈ ఇంట్లో 100కు పైగా గ‌దులు ఉన్నాయి. జియోనా కేవ‌లం వ‌డ్రంగి ప‌ని చేసుకుంటూనే ఇంత పెద్ద కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

 

వీరికి రోజుకు 45 కేజీల బియ్యం, 25 కిలోల ప‌ప్పు వండుతారు. రోజుకు రెండుసార్లు వంట వండుతారు. ఈ కుటుంబం రోజుకు 20 కిలోల పండ్లను తీసుకుంటుంది. ప్ర‌తి రోజు ఎవ‌రో ఒక‌రి పుట్టిన రోజు ఉంటూనే ఉంటుంది. స‌హ‌జంగానే ఇద్ద‌రు, ముగ్గురు అన్న‌ద‌మ్ముల కుటుంబాల్లోనే తోడికోడళ్ల‌కు పొస‌గ‌దు. కానీ 39 మంది భార్య‌లు ఉన్నా కూడా ఆ ఇంట్లో ఎలాంటి మ‌న‌స్ప‌ర్థ‌లు లేకుండా వారు క‌లిసి మెలిసి ఉంటున్నారు.

Leave a comment