Moviesఆఫ‌ర్లు లేని పాయ‌ల్‌కు పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చిందే..!

ఆఫ‌ర్లు లేని పాయ‌ల్‌కు పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చిందే..!

ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్‌గా న‌టించి ఒక్కసారిగా వెలుగులోకి వ‌చ్చింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో న‌టించ‌డంతో ఈ అమ్మ‌డికి తొలి సినిమాతో మంచి గుర్తింపు వ‌చ్చింది. పైగా ఈ సినిమాలో బోల్డ్ సీన్లు యూత్‌కు బాగా క‌నెక్ట్ అయ్యాయి. ఆ త‌ర్వాత ఆమెకు ప‌లు సినిమాల్లో ఛాన్సులు వ‌చ్చినా అవేవి ఆమెకు స్టార్ డ‌మ్ అయితే తేలేదు. అయితే ఇప్ప‌ట‌కీ ఆమెను అంద‌రూ ఆర్ఎక్స్ 100 బ్యూటీనే అని పిలుస్తున్నారు. పైగా విక్ట‌రీ వెంక‌టేష్ ప‌క్క‌న వెంకీమామ‌లో చేసినా ఆమె కెరీర్‌కు యూజ్ అవ్వ‌లేదు.

 

అస‌లే ఆఫర్లు లేకుండా ఖాళీగా ఉన్న ఈ అమ్మ‌డికి ఇప్పుడు మ‌రో క‌ష్టం వ‌చ్చి ప‌డింది. లాక్‌డౌన్ వ‌ల్ల పాయ‌ల్ ఇంట్లో ఖాళీగా ఉండ‌డంతో ఆమె ఏకంగా 62 కేజీల బ‌రువు పెరిగిపోయింద‌ట‌. ఇటీవ‌ల కాస్త వ‌ర్క‌వుట్లు చేసి 58 కేజీల‌కు త‌గ్గింద‌ట‌. పాత లుక్‌లోకి రావాలంటే మ‌రింత స‌న్న‌బ‌డాలి. అయితే తాను 52 కేజీల‌కు వ‌చ్చే వ‌ర‌కు వ‌ర్క‌వుట్లు చేస్తూనే ఉంటాన‌ని చెపుతోంది. ఇప్ప‌టికే ఛాన్సులు లేవు.. మ‌రీ బొద్దుగుమ్మ‌లా మారితే అస‌లేమాత్రం ఛాన్సులు రావ‌మ్మా ? అంటూ కొంద‌రు నెటిజ‌న్లు ఆమెపై సెటైర్లు వేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news