Moviesబ్రేకింగ్‌: నాని V సినిమా రిలీజ్ డేట్ చేంజ్‌... కొత్త డేట్...

బ్రేకింగ్‌: నాని V సినిమా రిలీజ్ డేట్ చేంజ్‌… కొత్త డేట్ ఇదే

నేచుర‌ల్ స్టార్ నాని – సుధీర్‌బాబు కాంబినేష‌న్లో తెర‌కెక్కిన వీ సినిమా ఇప్ప‌టికే టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో ఆక‌ట్టుకుంది. అదితిరావు హైద‌రీ, నివేధా థామ‌స్ జంట‌గా న‌టించిన ఈ సినిమా ఓ స‌స్పెన్స్ క్రైం థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. విభిన్న సినిమాల‌తో మంచి పేరు తెచ్చుకున్న మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. లాక్‌డౌన్ వ‌ల్ల సినిమాల‌కు మొఖం వాచి ఉన్న తెలుగు ప్రేక్ష‌కులు వీ కోసం ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు.

Nani's 'V' Movie Will Hit The Amazon Prime On 5th September

ఎప్పుడో మార్చి 25న రావాల్సిన ఈ సినిమా వాయిదా ప‌డి ఎట్ట‌కేల‌కు డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్లు కూడా సోష‌ల్ మీడియాలో జోరుగా జ‌రుగుతున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఈ సినిమా రిలీజ్ డేట్ మారింది. ముందుగా సెప్టెంబ‌ర్ 5వ తేదీన అమోజాన్ ప్రైమ్‌లో సినిమా రిలీజ్ చేయాల‌నుకున్నారు. ఆ రోజు నుంచి డిజిట‌ల్ ప్రీమ‌య‌ర్‌గా వ‌దిలే ప్ర‌ణాళిక‌లు వేసుకున్నారు.

Nani-Sudheer Babu's V Movie Story Leaked Days Before Its Release On Amazon  Prime

ఇక కొత్త డేట్ ప్ర‌కారం ఒక రోజు ముందే నాని వీ డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌లోకి రానుంది. సెప్టెంబర్ 4 వ తారీఖు రాత్రి 9 గంటల 30 నిమిషాల నుంచే స్ట్రీమింగ్ కు రానున్నట్టుగా తెలుస్తుంది. 4వ తేదీ రాత్రి నుంచే నాని అభిమానులే కాకుండా…. తెలుగు సినీ ల‌వ‌ర్స్ అంద‌రూ పండ‌గ చేస్కోవ‌చ్చ‌న్న మాట‌.

Latest news