మెగాస్టార్ తొలి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా…!

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో మెగాస్టార్ చిరంజీవిది మూడు ద‌శాబ్దాల తిరుగులేని ప్ర‌స్థానం. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన కొన్నేళ్ల‌కే స్టార్ హీరో అయిన చిరంజీవి ఇప్ప‌ట‌కి అదే ప్లేసులో ఉన్నాడు. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే తొలిసారి కోటి రూపాయ‌లు అందుకున్న తొలి హీరో చిరంజీవి. ఘ‌రానా మొగుడు సినిమా కోసం చిరంజీవి ఈ రెమ్యున‌రేష‌న్ అందుకున్నాడు. ఇక గ‌తేడాది చిరు న‌టించిన సైరా సినిమా కోసం రు. 30 కోట్లు చిరుకు రెమ్యున‌రేష‌న్‌గా ముట్టింద‌ట‌.

Telugu movies: Chiranjeevi remembers Punadi Rallu | Telugu Movie News -  Times of India

అయితే చిరు త‌న తొలి సినిమాకు తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా. ? అక్ష‌రాలా రు. 1116 మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం. 1978లో ఎలాంటి పునాది లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన చిరంజీవి ఈ రోజు తెలుగు సినీ ల‌వ‌ర్స్ హృద‌యాల్లో మెగాస్టార్‌గా ఎదిగిపోయాడు. చిరుకు పునాదిరాళ్లు తొలి సినియా అయినా రిలీజ్ అయ్యింది మాత్రం ప్రాణం ఖ‌రీదు. ఇక టాలీవుడ్‌కు బ్రేక్ డ్యాన్స్ నేర్పిన ఘ‌న‌త సైతం చిరుకే ద‌క్కింది.

Pathetic State Of Chiru's Debut Director

చిరంజీవికి కేంద్ర ప్ర‌భుత్వం 2006లో ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు ఇచ్చి స‌త్క‌రించింది. త‌ర్వాత చిరు ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డం ద్వారా రాజ్య‌స‌భ‌కు ఎంపిక కావ‌డంతో పాటు కేంద్ర మంత్రి కూడా అయ్యారు.

Leave a comment