Moviesఅట్ట‌ర్ ప్లాప్ సినిమాతో మ‌హేష్ దుమ్ము లేపేశాడు... ఏం రికార్డు కొట్టాడులే..

అట్ట‌ర్ ప్లాప్ సినిమాతో మ‌హేష్ దుమ్ము లేపేశాడు… ఏం రికార్డు కొట్టాడులే..

మ‌హేష్‌బాబు న‌టించిన కొన్ని సినిమాలు వెండి తెర‌పై ప్లాప్ అయినా బుల్లితెర‌పై మాత్రం సూప‌ర్ హిట్ కొట్టాయి. ఇందుకు అత‌డు, ఖ‌లేజా సినిమాలే ఉదాహ‌ర‌ణ‌. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తీసిన ఈ రెండు సినిమాలు థియేట‌ర్లో పెద్ద‌గా ఆడ‌లేదు. కానీ బుల్లితెర‌పై ఎప్పుడు వ‌చ్చినా ఇప్ప‌ట‌కీ అదిరిపోయే టీఆర్పీ రేటింగులు వ‌స్తాయి. ఇక అత‌డు బుల్లితెర‌పై ఇప్ప‌టికే 1000 సార్ల‌కు పైగా ప్ర‌సారం అయ్యింది. అయినా ఇప్ప‌ట‌కీ ఈ సినిమాకు అదిరిపోయే వ్యూవ‌ర్‌షిఫ్ ఉంది.

ఈ క్ర‌మంలోనే మ‌హేష్ న‌టించిన మ‌రో డిజాస్ట‌ర్ మూవీ ఆగ‌డు యూట్యూబ్‌లో స‌రికొత్త సంచ‌ల‌న రికార్డు క్రియేట్ చేసింది. త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు శ్రీను వైట్ల ద‌ర్శ‌కుడు. ఈ సినిమాను హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో పెట్టారు. మొత్తం అన్ని భాష‌ల్లో క‌లిపి ఆగ‌డు సినిమాను యూట్యూబ్‌లో ఏకంగా 500 మిలియ‌న్ల మంది చూశారు. ఓ తెలుగు సినిమ‌కు ఈ రేంజ్‌లో వ్యూస్ రావ‌డం పెద్ద సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. ఇక మ‌హేష్ మ‌రో ప్లాప్ సినిమాలు సైనికుడు, బ్ర‌హ్మోత్స‌వం సినిమాలకు కూడా యూట్యూబ్‌లో భారీ వ్యూస్ వ‌చ్చాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news