శృంగార వీడియోల‌తో ఖ‌మ్మం ఆంటీ బ్లాక్‌మెయిల్… ఒక‌రు ఇద్ద‌రు కాదు.. ఎన్ని వీడియోలంటే..!

తెలంగాణ‌లోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గంలోని పాల్వంచ‌లో ఓ ఆంటీ బ‌డా బాబుల‌కు వ‌ల‌వేసి….. వారితో శృంగారం నెర‌పుతూ వీడియోలు తీసి త‌ర్వాత వాటితోనే ఆ బ‌డా బాబుల‌ను డ‌బ్బులు ఇవ్వాల‌ని బ్లాక్ మెయిల్ చేస్తోన్న ఉదంతం బ‌య‌ట ప‌డింది. పాల్వంచలో బ‌రి తెగించిన ఆ ఆంటీ బ‌డా బాబుల‌ను టార్గెట్‌గా చేసుకుని వారిని ముగ్గులోకి దింపి… ఆ త‌ర్వాత వారితో శృంగారం చేసే టైంలో వీడియోలు షూట్ చేసి వాటితో ఆ బ‌డా బాబుల‌ను డ‌బ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తోంది.

 

పాల్వంచ‌లోని టీచ‌ర్స్ కాల‌నీకి చెందిన ఈ ఆంటీ ఇప్ప‌టి వ‌ర‌కు 10 మందికి పైగా బ‌డా బాబులు ఈమె వ‌ల‌లో ప‌డి.. త‌మ వీడియోలు బ‌య‌ట‌కు వ‌స్తే ప‌రువు పోతుంద‌ని.. ఈమెకు లక్షల్లో సమర్పించుకున్నారు. అయితే ఓ చిన్న వ్యాపారి ఆమె గుట్టు ర‌ట్టు చేశాడు. శాస్త్రి రోడ్డుకు చెందిన ఓ చిన్న వ్యాపారిని కూడా ఇలానే బెదిరించింది సదరు మహిళ. 10 లక్షలు ఇవ్వాలని, లేక‌పోతే ఆ వీడియోల‌తో పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌ని బెదిరించింది.

 

అయితే స‌ద‌రు చిన్న వ్యాపారి ద‌గ్గ‌ర అంత డ‌బ్బు లేక‌పోవ‌డంతో పోలీసుల్ని ఆశ్రయించాడు. చివ‌ర‌కు ఆ మ‌హిళ‌ను డ‌బ్బులు ఇస్తాం ర‌మ్మ‌ని చెప్పి… ఆ మ‌హిళ‌తో పాటు మ‌రో ముగ్గురిన వ‌ల‌ప‌న్ని అరెస్టు చేశారు. ఆ మ‌హిళ ఫోన్ ప‌రిశీలిస్తే ఆమె ద‌గ్గ‌ర ఆమె ప‌లువురు బ‌డా బాబుల‌తో శృంగారం చేసిన వీడియోలే ఉన్నాయ‌ట‌.