సీఎంకు కౌంట‌ర్ ఇస్తూ టాలీవుడ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కంగ‌నా

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ ఏ వ్యాఖ్య చేసినా సంచ‌ల‌నం న‌మోదు అవుతూనే ఉంది. తాజాగా కంగ‌నా మ‌రోసారి యూపీ సీఎం ఆదిత్య‌నాథ్‌కు కౌంట‌ర్ ఇస్తూ టాలీవుడ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ మాట్లాడుతూ దేశంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీని తాము నిర్మించబోతున్నట్లుగా ప్రకటించాడు. ఈ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన కంగ‌న ప్ర‌జ‌లు కేవ‌లం హిందీ సినిమా ప‌రిశ్ర‌మ‌ను మాత్ర‌మే దేశంలో పెద్ద సినిమా ప‌రిశ్ర‌మ అనుకుంటున్నార‌ని.. అది పూర్తిగా త‌ప్ప‌ని కంగ‌న చెప్పింది.

 

 

 

మ‌న దేశంలో చాలా భాష‌ల సినిమా ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయ‌ని.. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ చాలా కీల‌క‌మైంద‌ని చెప్ప‌డంతో పాటు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ తనను తాను దేశంలో అగ్రగణ్యమైన సినిమా పరిశ్రమగా నిలుపుకుంద‌ని ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించింది. పాన్ ఇండియా సినిమాలు చేయ‌డంల తెలుగు మేక‌ర్స్ ఎప్పుడూ ముందుంటార‌ని…. ఎన్నో హిందీ సినిమాల షూటింగ్‌లు సైతం హైద‌రాబాద్‌లో ఉన్న రామోజీ ఫిల్మ్‌సిటీలో జ‌రుగుతున్నాయ‌ని కంగ‌న చెప్పింది. ఏదేమైనా కంగ‌న టాలీవుడ్‌పై ప్ర‌శంస‌లు కురిపించ‌డం ప్ర‌శంస‌నీయ‌మే..!

Leave a comment