Moviesసంద్ర‌పు తీరాల్లో..ఇసుక తిన్నెల్లో..

సంద్ర‌పు తీరాల్లో..ఇసుక తిన్నెల్లో..

శివ‌సాగ‌ర్ బీచ్ (ప‌లాస‌, శ్రీ‌కాకుళం) : జ‌న‌సేనాని ప‌వ‌న్ పుట్టిన రోజు వేడుక‌లు పుర‌స్క‌రించుకుని ప‌్ర‌సిద్ధ శివ‌సాగ‌ర్ బీచ్ లో వ ‌ర్థ‌మాన చిత్ర‌కారుడు లాల్ ప్ర‌సాద్ దాకోజు రూపొందించిన సైక‌త శిల్పం చూప‌రుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. 12 ఇంటూ 10 సైజులో రూపుదిద్దు కున్న ఈ సైక‌త శిల్పాన్ని కేవ‌లం నాలుగు గంట‌ల్లోనే పూర్తిచేశారు. ఈ సంద‌ర్భంగా చిత్ర‌కారులు, సైక‌త శిల్ప రూప‌క‌ర్త అయిన లాల్ ప్ర‌సాద్ దాకోజును జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు దిలీప్ పాణి గ్ర‌హీతో స‌హా ప‌లాస నియోజక‌వ‌ర్గ కార్య‌క‌ర్త‌లు అభినందించారు. ఏటా మాదిరిగానే ప‌వ‌ర్ స్టార్ పుట్టిన రోజు త‌మ‌కో ప్ర‌త్యేక వేడుక అని పేర్కొంటూ, ఈ పండుగ వేళ ఆయ‌న ఆశ‌య సాధ‌న‌లో భాగంగా రక్త‌దాన శిబిరాన్ని సైతం నిర్వ‌హించామ‌ని చెప్పారు.

అదేవిధంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు త‌మ వంతు బాధ్య‌త‌గా యాభై ల‌క్ష‌ల రూపాయ‌లు విలువ‌చేసే ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు పంపిణీ చేశార‌ని తెలిపారు. ఇదే రీతిన మున్ముందూ సామాజిక బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించ‌డంలో తామెన్న‌డూ ముందుంటామ‌ని అన్నారు. అనంత‌రం ఆర్టిస్టు లాల్ ప్ర‌సాద్ దాకోజు మాట్లాడుతూ త‌న‌కీ అవ‌కాశం ఇచ్చిన జ‌న సైనికుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ..ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు పుట్టిన శుభాకాంక్ష‌లు చెప్పారు. త‌న‌లాంటి వారిని ప్రోత్స‌హించే క్ర‌మంలో ముందుండే జ‌న‌సేనానికి మ‌రిన్ని విజ‌యాలు ద‌క్కాల‌ని ఆకాంక్షించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news