చిత్రం హీరోయిన్ రీమాసేన్ భ‌ర్త ఎవ‌రో తెలుసా..!

ఒక‌ప్పుడు చిత్రం సినిమాతో తెలుగు కుర్ర‌కారును ఓ ఊపు ఊపేసింది రిమాసేన్‌. ఆ సినిమాలో రిమా హాట్ అందాలు, కాలేజ్ ల‌వ్‌స్టోరీని చూసేందుకు కుర్ర‌కారు థియేట‌ర్ల‌కు ప‌రుగులు పెట్టేవారు. 2000వ సంవ‌త్స‌రంలో ఉద‌య్‌కిర‌ణ్ హీరోగా తేజ ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన సినిమాతో ఆమె వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌ర్వాత ఇదే జంట మ‌న‌సంతా నువ్వే సినిమాలో న‌టించి మ‌రోసారి మెప్పించింది.

Actress Reema Sen Family Members Photos with Husband, Son & Biography -  YouTube

త‌మిళ్‌, తెలుగు భాష‌ల్లో ఆమె కొన్నేళ్ల పాటు స్టార్ హీరోల‌తో న‌టించింది. అప్ప‌ట్లో అంద‌రు స్టార్ హీరోల‌తో జోడీ క‌ట్టిన రిమా యుగానికి ఒక్క‌డు, శింబు వల్ల‌భ సినిమాల్లో విల‌న్‌గా న‌టించి అంద‌రికి షాక్ ఇచ్చింది. ఆమె స్టార్ డంలో ఉన్న‌ప్పుడే సినిమాల‌కు దూర‌మై పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త అయిన శివ‌క‌ర‌ణ్ సింగ్‌ను ఆమె 2012లో వివాహం చేసుకుంది. ఈ దంప‌తుల‌కు ఒక బాబు ఉన్నాడు.

Reema Sen Family, Husband, Age, Height, Biography

క‌ర‌ణ్‌సింగ్ ఓ ప్ర‌ముఖ రెస్టారెంట్స్ గ్రూప్స్‌కు అధినేత‌. ఈయ‌న‌కు ప్ర‌తి రాష్ట్రంలోనూ రెస్టారెంట్లు ఉన్నాయి. రిమాసేన్‌ను తొలి చూపులోనే ప్రేమించిన క‌ర‌ణ్‌సింగ్ 2012లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2013లో ఈ దంప‌తుల‌కు రుద్ర‌వీర్‌సింగ్ అనే కుమారుడు జ‌న్మించాడు. ప్ర‌స్తుతం రిమా త‌న భ‌ర్త‌, కుమారుడుతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

Leave a comment