Gossipsహీరో త‌రుణ్ పెళ్లి ఫిక్స్‌... ఆ అమ్మాయితోనే మూడు ముళ్లు.. ఏడు...

హీరో త‌రుణ్ పెళ్లి ఫిక్స్‌… ఆ అమ్మాయితోనే మూడు ముళ్లు.. ఏడు అడుగులు..!

రెండు ద‌శాబ్దాల క్రితం వ‌చ్చిన నువ్వే కావాలి సినిమాతో యూత్‌లో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యాడు హీరో త‌రుణ్‌. ఆ త‌ర్వాత ఒక‌టీ ఆరా హిట్లు వ‌చ్చినా త‌ర్వాత హీరోయిన్ ఆర్తీ అగ‌ర్వాల్‌తో ప్రేమాయ‌ణం న‌డ‌ప‌డం.. వ‌రుస ప్లాపుల‌తో త‌రుణ్ కెరీర్ అస్త‌వ్య‌స్థ‌మైంది. చివ‌ర‌కు త‌రుణ్‌కు ఛాన్సులు ఇచ్చేందుకు కూడా ఎవ్వ‌రూ ముందుకు రాలేదు. ఆర్తీని త‌రుణ్ పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నా త‌రుణ్ త‌ల్లి రోజా ర‌మ‌ణి ఒప్పుకోక‌పోవ‌డం వ‌ల్లే ఈ పెళ్లి జ‌ర‌గలేద‌న్న టాక్ ఉంది.

ఏదేమైనా అటు ఆర్తీ కూడా కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులు ప‌డి చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఇటు త‌రుణ్ సినిమాలు లేక చివ‌ర‌కు రెస్టారెంట్ బిజినెస్ పెట్టుకున్నాడు. అప్ప‌టి నుంచి త‌రుణ్ పెళ్లి జ‌రుగుతుంద‌న్న వార్త‌లు వ‌చ్చినా ఇన్నేళ్లుగా పెళ్లి జ‌ర‌గ‌లేదు. ఎట్ట‌కేల‌కు త‌రుణ్ పెళ్లి ఫిక్స్ అయ్యింద‌ట‌. త‌రుణ్ త‌ల్లి రోజా ర‌మ‌ణి స్నేహితురాలు కుమార్తెతో త‌రుణ్ పెళ్లి జ‌ర‌గ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

పీజీ కంప్లీట్ చేసిన ఆ యువ‌తి విదేశాల్లో ఉన్న‌త విద్య అభ్య‌సించిన ఆ యువ‌తి ఇటీవ‌లే హైద‌రాబాద్‌కు తిరిగి వ‌చ్చింద‌ట‌. త్వ‌రలోనే మంచి  ముహూర్తం చూసి త‌రుణ్‌కు, ఆ యువ‌తికి పెళ్లి చేసే ఏర్పాట్లు జ‌రుగుతున్నాయంటున్నారు. ఈ యేడాదే త‌రుణ్ పెళ్లి ఉంటుంద‌ని త‌రుణ్ ఫ్రెండ్స్ ద్వారా క్లారిటీ వ‌స్తోంది. మొత్తానికి త‌న అమ్మ చూసిన యువ‌తికే త‌రుణ్ మూడు ముళ్లు వేసి.. ఆమెతో ఏడ‌డుగులు న‌డ‌వ‌నున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news