Moviesఇప్ప‌ట‌కీ కుర్ర హీరోయిన్ల‌కు పోటీ ఇచ్చే ర‌మ్య‌కృష్ణ వ‌య‌స్సు ఎంతో తెలుసా..

ఇప్ప‌ట‌కీ కుర్ర హీరోయిన్ల‌కు పోటీ ఇచ్చే ర‌మ్య‌కృష్ణ వ‌య‌స్సు ఎంతో తెలుసా..

బాహుబ‌లిలో శివ‌గామిగా ఇంట‌ర్నేష‌న‌ల్ వైడ్‌గా పాపుల‌ర్ అయ్యింది ర‌మ్య‌కృష్ణ‌. ఆమె ఇండ‌స్ట్రీకి వ‌చ్చి మూడు ద‌శాబ్దాలు దాటుతోంది. ఫ్యామిలీ ఓరియంటెడ్‌, లేడీ ఓరియంటెడ్ ఏ సినిమా అయినా ర‌మ్య‌కృష్ణ న‌ట‌న‌కు తిరుగు లేదు. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ర‌మ్య‌కృష్ణ ఇప్పుడు వెండితెర‌తో పాటు బుల్లితెర‌ను కూడా ఏలుతోంది.

 

ఈ సీనియ‌ర్ న‌టి డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీని పెళ్లి చేసుకుని ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ర‌మ్య‌కృష్ణ నేడు 50వ పుట్టిన రోజు జురుపుకుంటోంది. రమ్యకృష్ణ తన భర్త కృష్ణవంశీ, పిల్లలు ఇతర కుటుంబసభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. అద్బుతమైన 5 పదుల వయస్సు..అంటూ ఇన్ స్టాగ్రామ్ లో క్యాప్షన్ ఇచ్చింది.

 

 

వాస్త‌వంగా ఆమెను చూస్తే అంత వ‌య‌స్సు ఉందా ? అన్న సందేహం క‌లుగుతుంది. ఇప్ప‌ట‌కి ఆమె కుర్ర హీరోయిన్ల‌కు పోటీ ఇచ్చేలా న‌టించ‌డంతో పాటు క‌నిపిస్తుంది కూడా…!  ఇప్పుడు ముద‌రు హీరోయిన్లు అనుష్క‌, న‌య‌న‌తార  అందానికి ర‌మ్య అందం ఎంత మాత్రం తీసిపోద‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news