Moviesఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్ టాలీవుడ్ హీరోయిన్ భ‌ర్తే... ఎవ‌రా కంటెస్టెంట్‌

ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్ టాలీవుడ్ హీరోయిన్ భ‌ర్తే… ఎవ‌రా కంటెస్టెంట్‌

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ ప్రారంభ‌మైంది. ఇప్పటికే ఐదు రోజులు పూర్తి చేసుకుని తొలి వీకెండ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఇక హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల‌లో ఓ కంటెస్టెంట్ మ‌న టాలీవుడ్ హీరోయిన్‌కు భ‌ర్తే. బాల్య‌నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన సూర్య‌కిర‌ణ్ ఆ త‌ర్వాత డైరెక్ట‌ర్ అయ్యాడు కూడా.

Bigg Boss Telugu 4 contestant Surya Kiran : బిగ్ బాస్ కంటెస్టెంట్  సూర్యకిరణ్ భార్య హీరోయిన్ కల్యాణి | వినోదం News in Telugu

సూర్య కిరణ్. సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. ఇక అంత‌కు ముందు ప‌లు సీరియ‌ల్స్‌కు కూడా క‌థ‌లు అందించాడు. ద‌ర్శ‌కత్వం కూడా వ‌హించాడు. సూర్య కిర‌ణ్ తెలుగు హీరోయిన్ క‌ళ్యాణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ త‌ర్వాత వీరికి మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్నాడు.

డైరెక్టర్ గా మారిన సీనియర్ హీరోయిన్.. పూరి సపోర్ట్! | Senior Heroine Kalyani  Turns Director And Producer

గత కొన్నేళ్లుగా సినిమాల‌కు బ్రేక్ ఇచ్చిన‌ ఈ దర్శకుడు ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక తెలుగులో ప‌లు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగాను, సీరియ‌ల్స్‌లో న‌టిస్తోన్న సుజిత‌కు సూర్య‌కిర‌ణ్ స్వ‌యానా సోద‌రుడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news