వ‌కీల్‌సాబ్‌కు వ‌చ్చిన అన్ని కోట్ల ఆఫ‌ర్ రిజెక్ట్ చేసిన దిల్ రాజు.. !

క‌రోనా క‌ల్లోలంతో రిస్క్ చేయ‌లేని కొంద‌రు నిర్మాత‌లు త‌మ సినిమాల‌ను ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే వీ లాంటి మ‌ల్టీస్టార‌ర్ ఓటీటీలో రిలీజ్ కాగా రేపో మాపో అనుష్క నిశ్శ‌బ్దం సైతం ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అంద‌రూ ద‌స‌రాకు అయినా థియ‌ట‌ర్లు ఓపెన్ అవుతాయ‌న్న ఆశ‌తో ఉన్నా కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో గ్యారెంటీ లేదు.

ఇక ద‌స‌రాకు థియేట‌ర్లు ఓపెన్ కాక‌పోతే పెద్ద సినిమాల్లో కొన్ని కూడా ఓటీటీలో రాక త‌ప్ప‌ని ప‌రిస్థితి. థియేట‌ర్లు తెరిచే వ‌రకు వ‌డ్డీలు భ‌రించే ప‌రిస్థితి లేని వారికి ఓటీటీలే ఆప్ష‌న్ కానున్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్ సినిమాకు ఏకంగా ఏ తెలుగు సినిమాకు ఇవ్వని విధంగా ఓటీటీ వాళ్లు ఏకంగా రు. 110 కోట్ల ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌.

 

ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌ను కూడా దిల్ రాజు రిజెక్ట్ చేశాడ‌ని తెలుస్తోంది. రాజుకు ఈ సినిమా ఇంత క‌న్నా ఎక్కువ మొత్తం వ‌సూలు చేస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉండ‌బ‌ట్టే ఈ ఆఫ‌ర్ వ‌దులుకున్నార‌ని అంటున్నారు. అయితే రేపు థియేట‌ర్లు ఓపెన్ అయ్యి కేవ‌లం 50 శాతం కెపాసిటీకి మాత్ర‌మే అనుమ‌తించినా ఈ రు. 110 కోట్ల వ‌సూళ్లు క‌ష్ట‌మే అని విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రి రాజు ఏ ధైర్యంతో ఈ ఆఫ‌ర్‌ను వ‌దులుకున్నారో చూడాలి.

Leave a comment