Moviesబిగ్‌బాస్ ' దేత్త‌డి హారిక ' అంత మంచి జాబ్ వ‌దిలేసిందా..!

బిగ్‌బాస్ ‘ దేత్త‌డి హారిక ‘ అంత మంచి జాబ్ వ‌దిలేసిందా..!

బిగ్‌బాస్ కంటెస్టెంట్ దేత్త‌డి హారిక బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు కొత్త అయినా.. యూ ట్యూబ్ ప్రేక్ష‌కుల‌కు ఆమె సుప‌రిచిత‌మే. ఆమె తెలంగాణ యాస‌లో చేసిన వీడియోల‌కు ఏకంగా 20 కోట్ల వ్యూస్ వ‌చ్చాయ‌ట‌. ఆమె వీడియోల‌కు వ‌చ్చిన వ్యూస్ చూసి నాగార్జున సైతం షాక్ అయ్యాడు. బిగ్‌బాస్ సీజ‌న్ 3లోనే ఆమె ఉంటుంద‌ని ఆమె పేరు వినిపించినా ఆ సీజ‌న్లో ఆమె రాలేదు. ఇప్పుడు నాలుగో సీజ‌న్లో ఆమె ఎంట్రీ ఇచ్చింది. దేత్త‌డి ఛానెల్ ద్వారా సూప‌ర్ పాపుల‌ర్ అయిన హారిక‌ది హైద‌రాబాదే.

 

 

ఆమె ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ కంపెనీ అయిన అమోజాన్‌లో టాప్ పొజిష‌న్లో ఉండేది. ఆ త‌ర్వాత న‌ట‌న‌పై ఉన్న ఇష్టంతో ఆమె ఈ ఉద్యోగాన్ని కొద్ది నెల‌ల‌కే వ‌దిలేసింది. ఆ త‌ర్వాత దేత్త‌డి ఛానెల్ ద్వారా ప‌లు వీడియోలు చేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు యూ ట్యూబ్ ద్వారా బాగా ద‌గ్గ‌రైంది. ఇక డ్యాన్స్ అంటే ఎంతో ఇష్ట‌మ‌ని చెప్పే హారిక భ‌విష్య‌త్తులో కొరియోగ్రాప‌ర్‌గా కూడా మారాల‌ని అనుకుంటోంది.

 

 

ఇక బిగ్‌బాస్ హౌస్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటోన్న ఆమె గ‌ట్టి పోటీ ఇస్తోంది. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్‌ల‌లో ప‌ద్ద‌తిగా క‌నిపించిన ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో మాత్రం గ్లామ‌ర్ బాగానే ఆర‌బోస్తుంద‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news