Moviesబిగ్‌బాస్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం... కొత్త టెన్ష‌న్ మెద‌లైందిగా..!

బిగ్‌బాస్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం… కొత్త టెన్ష‌న్ మెద‌లైందిగా..!

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 4 రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సారి హౌస్‌లో గంగ‌వ్వ ఎంత ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అంతా స‌జావుగా సాగుతోంది అనుకుంటోన్న టైంలో ఇప్పుడు బిగ్‌బాస్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం మొద‌లైంది. బిగ్‌బాస్‌లో గంగ‌వ్వ తొలి మూడు రోజులు యాక్టివ్‌గా ఉన్నా త‌ర్వాత ఆమెలో జోష్ పూర్తిగా త‌గ్గిపోయింది. ఆమె హౌస్‌లో స్వేచ్ఛ‌గా ఉండ‌లేక‌పోతున్నార‌ని అర్థ‌మువుతోంది. ఇక ఆమెకు కాస్త అనారోగ్యంగా ఉండ‌డంతో నిర్వాహ‌కులు క‌రోనా టెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

 

 

వాస్త‌వానికి షో ప్రారంభానికి ముందే కంటెస్టెంట్లు అంద‌రికి క‌రోనా టెస్టులు చేసి.. వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచారు. వీరింద‌రికి నెగిటివ్ వచ్చాకే లోప‌ల‌కు పంపారు. అయితే ఈ షో కోసం ప‌నిచేస్తోన్న కొంద‌రు టెక్నీషియ‌న్లుకు క‌రోనా సోకిన‌ట్టు స‌మాచారం. ఇదే స‌మ‌యంలో హౌస్‌లో గంగ‌వ్వ అనారోగ్యానికి గురి కావ‌డంతో ముందు జాగ్ర‌త్త‌లో భాగంగా క‌రోనా ప‌రీక్ష చేసిన‌ట్టు తెలిసింది. ఇంకా ఫ‌లితం రావాల్సి ఉంది. టెక్నీషియ‌న్ల‌కు క‌రోనా రావ‌డంతో ఇప్పుడు నిర్వాహ‌కుల్లో కాస్త క‌ల‌వ‌రం మొద‌లైన‌ట్టే తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news