అట్ట‌ర్ ప్లాప్ డైరెక్ట‌ర్‌తో చిరు మూవీ క‌న్‌పార్మ్ చేసిన ప‌వ‌న్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా నిన్న ఎంతో మంది సెల‌బ్రిటీలు ప‌వ‌న్‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ అనుకోకుండా త‌న అన్న చిరంజీవి సినిమాను అధికారికంగా పొరపాటుగా ప్ర‌క‌టించేశారు. నాలుగు వ‌రుస ప్లాపుల‌తో ఇండ‌స్ట్రీలో మెహ‌ర్ ర‌మేష్ పేరు చెపితే హీరోలు భ‌య‌ప‌డిపోతున్నారు. అస‌లు మెహ‌ర్ ర‌మేష్‌ను ద‌గ్గ‌ర‌కు రానిచ్చే ప‌రిస్థితి కూడా లేదు. అస‌లు ఆయ‌న క‌థ‌లు చెపుతానంటే అపాయింట్‌మెంట్ ఇచ్చే హీరోలు కూడా లేరు.

ఇక శ‌క్తి, షాడో సినిమాలు చూశాక మెహ‌ర్ పేరు చెపితేనే ఇండ‌స్ట్రీ భ‌య‌ప‌డిపోతోంది. అయితే కొద్ది రోజులుగా మెహ‌ర్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడ‌న్న ప్ర‌చారం ఉంది. ఈ విష‌యాన్ని చిరంజీవి కూడా ఓ సారి చెప్ప‌డంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు. చిరు మెహ‌ర్‌తో ఎందుకు సినిమా చేస్తాడ‌ని సందేహంతో ఉన్నారు. ఇలాంటి డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేసే రిస్క్ చిరు చేయ‌డ‌నే అనుకున్నారు. అయితే తాజాగా వీరిద్ద‌రి కాంబోలో సినిమాను ప‌వ‌న్ రివీల్ చేయ‌డంతో అంద‌రూ షాక్‌లో ఉన్నారు.

పవన్ పుట్టిన రోజుకు మెహర్ రమేష్ శుభాకాంక్షలు తెలియజేశాడు. అందుకు రిప్లై ఇచ్చిన ప‌వ‌న్ థ్యాంక్యు ర‌మేష్ నువ్వు చిరంజీవి గారితో చేస్తోన్న మూవీకి ఆల్ ద బెస్ట్ అని రిప్లే ఇచ్చాడు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు అనుమానంగా ఉన్న చిరు – మెహ‌ర్ మూవీపై క్లారిటీ వ‌చ్చేసింది. దీంతో ఇప్పుడు మెగా అభిమానులు ఫుల్ డిఫెన్స్‌లో ప‌డ్డారు. గ‌తంలో ఆచార్య టైటిల్ విష‌యంలో చిరు టంగ్ స్లిప్ అయ్యి టైటిల్ రివీల్ చేశాడు. ఇప్పుడు చిరు – మెహ‌ర్ సినిమా విష‌యంలో ప‌వ‌న్ ఇలా బ‌య‌ట ప‌డిపోయాడు.