Moviesబిగ్‌బాస్ హౌస్‌లో చ‌ర‌ణ్ హాట్ హీరోయిన్‌..!

బిగ్‌బాస్ హౌస్‌లో చ‌ర‌ణ్ హాట్ హీరోయిన్‌..!

బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ విజ‌య‌వంతంగా రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి వారం చ‌ప్ప‌గా సాగినా రెండో వారంలో కాస్త పుంజుకుంది. ఇక తొలి వారం ఎలిమినేష‌న్లో డైరెక్ట‌ర్ సూర్య కిర‌ణ్ ఎలిమినేట్ అవ్వ‌గా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సూర్య‌కిర‌ణ్ లోప‌ల‌కు ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ ఫ్యాన్స్‌కు మ‌రో అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే హౌస్‌లో హీరోయిన్ మోనాల్ గ‌జ్జ‌ర్ ఉండ‌గా మ‌రో హీరోయిన్ సైతం ఎంట్రీ ఇవ్వ‌బోతోంది.

ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు నేహాశ‌ర్మ‌. చిరుత సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ ప‌క్క‌న న‌టించిన నేహాశ‌ర్మ ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. చిరుత సినిమాలో ఆమె ఎంత హాట్ గా అందాలు ఆర‌బోసిందో తెలిసిందే. అయితే ఆమె ఎంట్రీ ఇచ్చేది తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో కాదు.. హిందీ బిగ్‌బాస్ హౌస్‌లోకి..!  ఇప్ప‌టికే హిందీలో 13 సీజ‌న్లు కంప్లీట్ అయ్యాయి. ఈ సీజ‌న్ 14వ ది కాగా.. దీనికి కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

 

14వ సీజ‌న్లో అక్టోబ‌ర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజ‌న్లో జాస్మిన్ భాసిన్‌, నేహా శ‌ర్మ‌, నిశాంత్‌సింగ్ మ‌ల్క‌నీ, ఇజాన్ ఖాన్‌, ప‌విత్ర పూనై, నైనా సింగ్‌, కుమార్ జాను, ఆలీ గోనీ, రాహుల్ వైద్య‌, క‌ర‌ణ్ ప‌టేల్‌, స్నేహ ఉల్లాల్‌, కొంద‌రు యూట్యూబ‌ర్లు ఈ సారి షోలో పాల్గొంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news