Newsకేంద్రం బిగ్ షాక్‌... ఒక‌టో తేదీ నుంచి వీటి ధ‌ర‌లు చుక్క‌ల్లోనే..

కేంద్రం బిగ్ షాక్‌… ఒక‌టో తేదీ నుంచి వీటి ధ‌ర‌లు చుక్క‌ల్లోనే..

కేంద్ర ప్ర‌భుత్వం ద‌స‌రా పండ‌గ సీజ‌న్ ముందు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. ఈ షాక్‌తో వ‌చ్చే ఒక‌టో తేదీ నుంచి ప‌లు వ‌స్తువ‌ల రేట్లు భారీగా పెర‌గ‌నున్నాయి. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో టీవీల ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. కేంద్రం గ‌తేడాది తీసుకున్న దిగుమతి సుంకం నిర్ణ‌యం ప్ర‌యోజ‌నం ఈ నెల‌తో ముగియ‌నుంది. దీంతో ఓపెన్ సేల్ ప్యానెల్స్‌పై 5 శాతం దిగుమ‌తి సుంకం మళ్లీ వ‌చ్చే నెల నుంచి అమ‌ల్లోకి రానుంది.

 

 

ఇక ఇప్ప‌టికే తీవ్ర‌మైన భారంతో ఉన్న టెలివిజ‌న్ ప‌రిశ్ర‌మ‌కు ఇది పెద్ద దెబ్బే అనుకోవాలి. ఫుల్లీ బిల్డ్ ఫ్యానెల్స్ ధ‌ర‌లు ఇప్ప‌టికే 50 శాతం పెరిగాయి. ఈ క్ర‌మంలోనే టీవీ మ్యానుఫాక్చ‌రింగ్ రంగంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు కేంద్రం గ‌త యేడాది నుంచి ప్యానెక్స్ దిగుమ‌తిపై 5 శాతం క‌స్ట‌మ్స్ డ్యూటీ రాయితీ వ‌చ్చింది. ఇది ఈ నెల 30 వ‌ర‌కు మాత్ర‌మే అమ‌ల్లో ఉంటుంది.

 

 

ఇక వ‌చ్చే నెల 1వ తేదీ నుంచి ఈ సుకం అమల్లోకి వ‌స్తే టీవీల ధ‌ర‌లు పెరుగుతాయి. ఒక్కో టీవీ ధ‌ర రు. 1200 – 1500 వ‌ర‌కు పెర‌గ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఎల్జీ – పోనాసోనిక్ – థామ్స‌న్ – శామ్‌సంగ్ టీవీల ధ‌ర‌లు 4 శాతం పెరుగుతాయంటున్నారు. 32 అంగుళాల టీవీల ధర కనీసం రూ.600 పెరిగితే, 42 అంగుళాల టీవీ రేటు రు. 1200 – 1500 పెరుగుతుంద‌ని అంచ‌నా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news