Moviesనీ న‌గ్న చిత్రాలు యూట్యూబ్‌లో పెట్ట‌నా.. భార్య‌కు టాలీవుడ్ ర‌చ‌యిత వేధింపులు

నీ న‌గ్న చిత్రాలు యూట్యూబ్‌లో పెట్ట‌నా.. భార్య‌కు టాలీవుడ్ ర‌చ‌యిత వేధింపులు

టాలీవుడ్ స్టోరీ రైట‌ర్ య‌ర్రంశెట్టి ర‌మ‌ణ గౌత‌మ్ త‌న భార్య నగ్న చిత్రాలు యూట్యూబ్‌లో పెడతాన‌ని వేధిస్తున్నాడంటూ అత‌డి భార్య పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం ఫిల్మ్‌న‌గ‌ర్లో క‌ల‌క‌లం రేపింది. ర‌మ‌ణ గౌత‌మ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్లో కేసు న‌మోదు అయ్యింది. బంజారాహిల్స్ రోడ్ నెంబ‌ర్ 12లో ఎన్బీటీన‌గ‌ర్లో నివ‌సించే ర‌మ‌ణ గౌత‌మ్ అదే ప్రాంతానికి చెందిన ఓ యువ‌తి ( 24)ను ప్రేమించి పెళ్లాడాడు. త‌ర్వాత వారికి మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో భార్య ర‌మ‌ణ గౌత‌మ్‌పై వేధింపుల కేసు పెట్ట‌గా … పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వ‌గా క‌లిసి ఉండేందుకు అంగీక‌రించారు.

ఆ త‌ర్వాత కూడా ర‌మ‌ణ గౌత‌మ్ భార్య‌కు దూరంగా ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం భార్య‌కు ఫోన్ చేసి నాపై పెట్టిన వేధింపుల కేసు ఎత్తివేస్తావా ?  లేదా నీ న‌గ్న చిత్రాలు యూట్యూబ్‌లో పెట్ట‌నా అని బెదిరిస్తున్నాడంటూ స‌ద‌రు యువ‌తి సోద‌రి మ‌రోసారి ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు వేధింపుల కేసు న‌మోదు చేశారు. ఇక త‌న సోద‌రి సైతం సినిమా ప‌రిశ్ర‌మ‌లోనే ఉంద‌ని.. ఆమె స్నేహితుల వ‌ద్ద కూడా త‌న సోద‌రి గురించి ర‌మ‌ణ గౌత‌మ్ చాలా అస‌భ్యంగా మాట్లాడుతున్నాడంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news