Moviesబిగ్‌బాస్‌లో నాగార్జున‌తో పాటు మ‌రో ఇద్ద‌రు గెస్ట్‌లు.. ఊహించ‌ని ట్విస్ట్ ఇది

బిగ్‌బాస్‌లో నాగార్జున‌తో పాటు మ‌రో ఇద్ద‌రు గెస్ట్‌లు.. ఊహించ‌ని ట్విస్ట్ ఇది

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న బిగ్‌బాస్ 4 సీజ‌న్ ఎంతో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. ఇక నాగార్జున ఎంట్రీ ఇస్తూ బిగ్‌బాస్ 4 సీజ‌న్ వివ‌రాలు చెపుతున్నారు. ఈ నాలుగో సీజ‌న్‌ను నాగార్జున హోస్ట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక హౌస్‌లోకి ఎవ‌రెవ‌రు ఎంట్రీ ఇస్తున్నారో ఫైన‌ల్ లిస్ట్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇక ఈ రోజు ప్రారంభ‌మ‌య్యే షోకు నాగార్జున‌తో పాటు మ‌రో ఇద్ద‌రు గెస్ట్ హోస్ట్‌లు కూడా రానున్నార‌ని తెలుస్తోంది.

ఈ ఇద్ద‌రు గెస్ట్ హోస్ట్‌లు ఎవ‌రో కాదు గ‌త సీజ‌న్ విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు పున‌ర్న‌వి భూపాలం అని తెలుస్తోంది. వీరిద్ద‌రి ఎంట్రీ ఊహించ‌ని ట్విస్టే అని చెప్పాలి. ఇక గ‌త బిగ్‌బాస్‌లో ఈ ఇద్ద‌రు న‌డిపిన హౌస్ రొమాన్స్ షోకు ఎంత స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అయ్యిందో తెలిసిందే.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news