వాట్సాప్‌లో మ‌రో అదిరిపోయే ఫీచ‌ర్‌… స్ట్రాంగ్ సెక్యూరిటీ

వాట్సాప్ మ‌రో అదిరిపోయే ఫీచ‌ర్‌ను త్వ‌ర‌లోనూ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త ఫీచ‌ర్ వాట్సాప్ వెబ్ యూజ‌ర్ల‌ను దృష్టిలో ఉంచుకుని ప‌రీక్ష చేస్తోంది. త్వ‌ర‌లోనే ఇది యూజ‌ర్ల‌కు అందుబాటులోకి రానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు వాట్సాప్ వెబ్‌లోకి క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయ‌డం ద్వారా లాగిన్ అయ్యే వెసులు బాటు ఉంది. ఇక‌పై ఇప్పుడు ఫ్రింగర్ ఫ్రింట్ ఆథెంటికేష‌న్ అనే ఫీచ‌ర్‌ను వాట్సాప్ ప్ర‌వేశ‌పెట్ట‌నుంది.

 

వాట్సాప్ వెబ్ వాడే వారు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త సెష‌న్‌కు ఫింగ‌ర్ ఫ్రింట్ ద్వారా ఆథెంటికేష‌న్ ఇవ్వాలి. వాట్సాప్ వెబ్‌ను వాడేట‌ప్పుడు ఫోన్లో ఫింగ‌ర్ ప్రింట్ ద్వారా క‌న్ ఫాం చేయ‌మ‌ని వాట్సాప్ ఆప్ష‌న్ ఇస్తుంది. అది ఓకే చేసిన వెంట‌నే వాట్సాప్ వెబ్‌లో యూజ‌ర్లు కొత్త సెష‌న్ మొద‌లు పెట్ట‌వ‌చ్చు. దీని వల్ల యూజ‌ర్ల‌కు మ‌రింత సెక్యూరిటీ ల‌భిస్తుంది.

Leave a comment