Gossipsటాలీవుడ్‌లో ఆ ఇద్ద‌రు హీరోల వార్‌... అస‌లేం జ‌రిగింది...!

టాలీవుడ్‌లో ఆ ఇద్ద‌రు హీరోల వార్‌… అస‌లేం జ‌రిగింది…!

క‌రోనా కార‌ణంగా టాలీవుడ్లో యేడాది కాలంగా సినిమాల రిలీజ్ షెడ్యూల్స్ మారిపోయాయి. కొంద‌రు చివ‌ర‌కు త‌మ సినిమాల‌ను ఓటీటీలో రిలీజ్ చేసుకుంటుంటే మ‌రి కొంద‌రు మాత్రం లేట్ అయినా థియేట‌ర్ల‌లోనే త‌మ బొమ్మ ప‌డాల‌ని చూస్తున్నారు. ఇక సంక్రాంతి రేసులో ఉన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎప్పుడు వ‌స్తుందో ?  కూడా తెలియ‌ని ప‌రిస్థితి. క‌రోనా త‌గ్గాక షూటింగ్ స్టార్ట్ అయినా కూడా ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయ్యేందుకు మ‌రో యేడాది ప‌డుతుంద‌ని అంటున్నారు.

ఇక వ‌చ్చే సంక్రాంతికి రామ్ రెడ్ సినిమా రేసులో ఉంది. ఈ సినిమా ఇప్ప‌టికే రెడీగా ఉన్నా రామ్ మాత్రం త‌న సినిమా ఇప్పుడు రెడ్ థియేట‌ర్ల‌లోనే రిలీజ్ కావాల‌ని చెపుతున్నారు. ఇక అఖిల్ అక్కినేని – బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబోలో వ‌స్తోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాని 2021 సంక్రాంతికి తీసుకురాబోతున్నారు. ఇక నితిన్ – కీర్తి సురేష్ కాంబోలో వ‌స్తోన్న రంగ్ దే సినిమా సైతం సంక్రాంతి రేసులోనే ఉంద‌ట‌. వీరికి తోడు యువ హీరో శర్వానంద్ కూడా సంక్రాంతి బరిలో దిగడానికి రెడీ అయ్యాడు.

శ‌ర్వానంద్ న‌టిస్తోన్న శ్రీకారం సినిమాను సంక్రాంతి రేసులో నిలిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ధరమ్ తేజ్ – దేవ‌కట్టా కాంబోలో వ‌స్తోన్న సినిమాను సైతం సంక్రాంతి రేసులోనే ఉంచార‌ట‌. ఇక ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ కూడా సంక్రాంతి రేసులోనే ఉంద‌న్న టాక్ ఉంది. ఇలా ఆరేడు సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నా.. వీటిలో ప్ర‌ధానంగా రామ్ రెడ్‌, నితిన్ రంగ్ దే రిలీజ్‌కు ప‌క్కాగా ఉన్నాయ‌ని.. ఈ ఇద్ద‌రు యంగ్ హీరోల మ‌ధ్యే అస‌లు సిస‌లు సంక్రాంతి స‌మ‌రం ఉంటుంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news