Newsబ్రేకింగ్‌: మ‌రో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కోవిడ్ పాజిటివ్‌

బ్రేకింగ్‌: మ‌రో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కోవిడ్ పాజిటివ్‌

ఏపీ, తెలంగాణ‌లో కోవిడ్ వ‌రుసగా ఎమ్మెల్యేల‌ను వెంటాడుతోంది. ఈ రోజు ఉద‌యం తిరుప‌తి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డికి కోవిడ్ నిర్దార‌ణ అయ్యింది. ఈ విష‌యం ఇలా ఉండ‌గానే లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం తెలంగాణ‌లో మ‌రో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కోవిడ్ ఎటాక్ అయ్యింది. సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆయనతో పారు ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

కొద్ది రోజులుగా అస్వ‌స్థ‌త‌తో ఉన్న ఆయ‌న కొద్ది సేప‌టి క్రిత‌మే ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్న కోన‌ప్ప దంప‌తుల‌కు కరోనా అని తేలడంతో కుటుంబ సభ్యుల తో కలిసి ఐసోలేషన్ కు వెల్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటన చేశారు. ఇక తనను కొద్ది రోజులుగా త‌న‌ను క‌లిసిన వారంద‌రు టెస్టులు చేయించుకోవాల‌ని కోరారు. ఇక‌ తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,688కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 780 కి చేరింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news