Newsబ్రేకింగ్‌: ఉగ్ర‌వాదుల హిట్ లిస్టులో తెలంగాణ ఎమ్మెల్యే

బ్రేకింగ్‌: ఉగ్ర‌వాదుల హిట్ లిస్టులో తెలంగాణ ఎమ్మెల్యే

తెలంగాణ‌లో బీజేపీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ ఉగ్ర‌వాదుల హిట్ లిస్టులో ఉన్నట్టు పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో పోలీసులు రాజాసింగ్‌కు భ‌ద్ర‌త పెంచారు. ప్ర‌భుత్వం కేటాయించిన బుల్లెట్ ఫ్రూప్ వాహ‌నంలో మాత్ర‌మే వెళ్లాల‌ని.. ఆయ‌న త‌న సొంత బుల్లెట్‌పై తిర‌గ‌డం మానుకోవాల‌ని కూడా సూచించారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ఎప్పుడూ ముందు ఉండే ఆయ‌న హిందూత్వ ఎంజెండాతోనే ఎప్పుడు దూకుడుగా ఉంటారు.

ఈ మేర‌కు హైద‌రాబాద్ పోలీసులు ఆయ‌న‌కు లేఖ రాయ‌డంతో పాటు డీసీపీ స్థాయి అధికారితో ఆయ‌న‌కు భ‌ద్ర‌త ప‌టిష్టం చేశారు. మ‌రోవైపు త‌న భ‌ద్ర‌త పెంచ‌డంపై రాజాసింగ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పోలీసులు త‌న గ‌న్‌మెన్ల‌ను మార్చేశార‌ని.. త‌న ఇంటి ప‌క్క‌ల అద్దెకు ఉండేవాళ్ల వివ‌రాలు సేక‌రిస్తూ ఇబ్బంది పెడుతున్నార‌ని అన్నారు.

త‌న‌కు ఎవ‌రి నుంచి ముప్పు ఉందో ముందు పోలీసులు చెప్పాల‌ని.. టెర్ర‌రిస్టుల నుంచి త‌న‌కు ముప్పు ఉందా ?  లేదా స్థానికంగా ఎవ‌రి నుంచి అయినా త‌న ప్రాణాల‌కు ముప్పు ఉందా ? అన్న విష‌యం చెప్పాల‌ని ఆయ‌న పోలీసుల‌ను కోరారు. ఈ విష‌యంపై రాష్ట్రం హోం మంత్రికి, కేంద్ర హోం మంత్రికి తాను లేఖ‌లు రాస్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news