Politicsఅమరావతి దెబ్బ అదుర్స్: ఆ నియోజకవర్గాల్లో టీడీపీ రిటర్న్స్

అమరావతి దెబ్బ అదుర్స్: ఆ నియోజకవర్గాల్లో టీడీపీ రిటర్న్స్

ఎన్నికలై ఏడాది దాటుతుంది. ఈ ఏడాది సమయంలో ప్రతిపక్ష టీడీపీ కాస్త పుంజుకున్నట్లే కనిపిస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు ఇప్పుడు ఫామ్‌లోకి వచ్చినట్లు కనబడుతోంది. ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతం ఉన్న గుంటూరు జిల్లాలో టీడీపీ పరిస్థితి మెరుగుపడినట్లు కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు దిశగా వెళ్ళడం, టీడీపీ అమరావతికి మద్ధతు తెలపడంతో జిల్లాలోని కొన్ని స్థానాల్లో టీడీపీ బలం పుంజుకుంది. 2019 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ కేవలం 2 సీట్లు గెలుచుకుంటే, వైసీపీ 15 సీట్లు గెలుచుకుంది.

 

అయితే టీడీపీ తరుపున గెలిచిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో జిల్లాలో టీడీపీకి ఒకే ఎమ్మెల్యే మిగిలారు. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్…ఇప్పటికీ బలంగా ఉన్నారు. ఇక గుంటూరు వెస్ట్‌లో గిరి వెళ్లిపోవడంతో, ఇన్‌ఛార్జ్‌గా కోవెలమూడి రవీంద్రబాబు రంగంలోకి దిగి టీడీపీ బలం తగ్గకుండా చూసుకున్నారు. అటు మంగళగిరిలో సైతం టీడీపీ మెరుగు పడింది. అక్కడి జనం ఇప్పుడు లోకేష్‌కు సపోర్ట్‌గా వస్తున్నారు. ఇక అమరావతి ప్రాంతంలో ఉన్న తాడికొండ నియోజకవర్గంలో సైతం టీడీపీ వేగంగా పుంజుకుంది.

 

మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ అమరావతి రైతుల కోసం నిత్యం ఉద్యామిస్తూనే ఉన్నారు. తెనాలిలో ఆలపాటి రాజా, వినుకొండలో జి‌వి ఆంజనేయులు, పొన్నూరులో ధూళిపాళ్ళ, పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్, గురజాలలో యరపతినేని శ్రీనివాసరావుల పరిస్థితి ఎన్నికల నాటికంటే మెరుగు పడినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే అమరావతి దెబ్బ అధికార పార్టీకి గట్టిగా తగిలి, టీడీపీకి బాగా కలిసొచ్చినట్లుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news