Moviesరియాకు మైండ్ బ్లాక్ అయ్యే కౌంట‌ర్ ఇచ్చిన సుశాంత్ సోద‌రి

రియాకు మైండ్ బ్లాక్ అయ్యే కౌంట‌ర్ ఇచ్చిన సుశాంత్ సోద‌రి

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న రియా చ‌క్ర‌వ‌ర్తి రెండు రోజులుగా జాతీయ మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ సుశాంత్‌కు డ్ర‌గ్స్ అల‌వాటు ఉంద‌ని.. ప్ర‌తి రోజు మ‌ద్యం తాగుతాడ‌ని… అత‌డు మానసిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నాడంటూ ఆరోప‌ణ‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇటు సుశాంత్ తండ్రితో స‌హా అత‌డి కుటుంబ స‌భ్యులు అంద‌రూ కూడా రియాపైనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇక రియా త‌న తాజా ఇంట‌ర్వ్యూలో సుశాంత్ ఫ్యామిలీపై కూడా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

సుశాంత్‌కు తండ్రి, సోద‌రితో విబేధాలు ఉన్నాయ‌ని చెప్పారు. వాళ్లు త‌ర‌చూ గొడ‌వ‌లు ప‌డేవారని కూడా రియా చెప్పారు. రియా ఆరోప‌ణ‌ల‌పై సుశాంత్ సోద‌రి శ్వేతా సింగ్ స్పందించింది. సోషల్ మీడియా ఖాతా ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించిన చాలా ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చింది. శ్వేతాసింగ్ విమాన ప్ర‌యాణ టిక్కెట్ షేర్ చేసి త‌న‌కు సుశాంత్‌పై ప్రేమ లేక‌పోతే ఈ యేడాది జ‌న‌వ‌రిలో తాను అమెరికా నుంచి ఇండ‌యాకు ఎందుకు వ‌స్తాన‌ని ప్ర‌శ్నించింది.

తాను పిల్ల‌ల‌ను, బిజినెస్‌ను వ‌దిలి సుశాంత్ చండీగఢ్ వెళుతున్నాడనే కారణంతో ఇండియాను వచ్చానని పేర్కొంది.  సుశాంత్ చనిపోయే రోజు వరకు ప్రతి విషయంలోనూ సుశాంత్ కు కుటుంబం అండగా నిలిచిందని తెలిపింది. శ్వేతా సింగ్ వ్యాఖ్యలపై రియా ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news