Moviesఅస‌లు సిస‌లు న్యూస్‌... మ‌హేష్‌బాబుకు విల‌న్‌గా సుధీర్‌బాబు

అస‌లు సిస‌లు న్యూస్‌… మ‌హేష్‌బాబుకు విల‌న్‌గా సుధీర్‌బాబు

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు, ఆయ‌న బావ‌మ‌రిది సుధీర్‌బాబు క‌లిసి న‌టిస్తే చూడాల‌న్న కోరిక చాలా మందికి ఉంది. సుధీర్‌బాబు ప్ర‌స్తుతం నేచుర‌ల్ స్టార్ నానితో క‌లిసి వి సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక బావ‌బావ‌మ‌రుదులు మ‌హేష్ – సుధీర్ కలిసి ఒకే సినిమాలో న‌టిస్తే చూడాల‌న్న కోరిక టాలీవుడ్ సినీ అభిమానులు అంద‌రికి ఉంది. అది ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు. తాజాగా సుధీర్‌బాబుకు మ‌హేష్ సినిమాలో చేస్తారా ? అన్న ప్ర‌శ్న ఎదురైంది ?  అది కూడా విల‌న్‌గా ?  దీనికి సుధీర్‌బాబు త‌న‌దైన స్టైల్లో ఆన్స‌ర్ ఇచ్చాడు.

మ‌హేష్ సినిమాలో విల‌న్‌గా చేసేందుకు త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని.. క్యారెక్ట‌ర్ బాగుంటే త‌ప్ప‌కుండా మ‌హేష్‌ను ఢీ కొట్టే విల‌న్‌గా న‌టిస్తాన‌ని.. ఈ అవ‌కాశం లేక‌పోయినా మ‌హేష్ ప‌క్క‌న ఒక‌టి రెండు సినిమాలో క‌నిపించినా బాగుంటుంద‌ని సుధీర్‌బాబు చెప్పాడు. ఇక తాను వెళ్లి మ‌హేష్‌ను అడిగి అత‌డి సినిమాలో న‌టించ‌డంతో పాటు రెండు, మూడు సీన్ల‌లో క‌నిపించ‌డం పెద్ద క‌ష్టం కాద‌ని సుధీర్‌బాబు త‌న తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పాడు.

అయితే ఆ క‌నిపించేదేదో మంచి పాత్ర‌లో క‌నిపిస్తే.. ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌ట‌కి గుర్తుండి పోతుంద‌న్నాడు. ఏదేమైనా సుధీర్‌బాబు కోరుకున్న‌ట్టు బావ మ‌హేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటే అది మ‌రో మ‌ర‌పురాని సినిమాగా టాలీవుడ్‌కు ప్రేక్ష‌కుల మ‌దిలో నిలుస్తుంది. ఇక మ‌హేష్‌తో రెగ్యుల‌ర్‌గా ఫోన్ ట‌చ్‌లో ఉంటాన‌న్న సుధీర్‌బాబు.. నెల‌లో ఒక‌టి రెండుసార్లు క‌లుస్తూనే ఉంటామ‌ని చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news