Gossipsరాజ‌మౌళి - మ‌హేష్ ప్రాజెక్టుకు అడ్డుప‌డుతోన్న స్టార్ హీరో... లాబీయింగ్ మొద‌లెట్టేశాడే...!

రాజ‌మౌళి – మ‌హేష్ ప్రాజెక్టుకు అడ్డుప‌డుతోన్న స్టార్ హీరో… లాబీయింగ్ మొద‌లెట్టేశాడే…!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఎన్టీఆర్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఆర్ ఆర్ ఆర్ సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా ఫినిష్ చేసిన వెంట‌నే రాజ‌మౌళి త‌న నెక్ట్స్ సినిమా సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుతోనే ఉంటుంద‌ని ప్ర‌క‌టించేశారు. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై డాక్ట‌ర్ కేఎల్‌. నారాయ‌ణ ఈ సినిమాను నిర్మిస్తారు. అప్పుడెప్పుడో పాత జ‌మానాలో సింహాద్రి హిట్ అయ్యాక కేఎల్‌. నారాయ‌ణ రాజ‌మౌళికి అడ్వాన్స్ ఇచ్చారు. అప్ప‌టి నుంచి ఈ బ్యాన‌ర్‌లో రాజ‌మౌళి సినిమా చేయ‌డం కుద‌ర‌ట్లేదు.

అలాగే మ‌హేష్‌బాబుకు కూడా నారాయ‌ణ అడ్వాన్స్ ఇచ్చారు. అలా అనుకోకుండా వీరిద్ద‌రి ప్రాజెక్టు సెట్ అయ్యింది. ఇక ఎప్ప‌టి నుంచో రాజ‌మౌళి – మ‌హేష్ క‌లిసి ప‌నిచేయాల‌నుకుంటున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత  ఈ ప్రాజెక్టు సెట్ అవ్వ‌డం ఖ‌రారే అనుకుంటోన్న టైంలో ఇప్పుడు ఓ బాలీవుడ్ స్టార్ హీరో ఈ ప్రాజెక్టుకు అడ్డు ప‌డుతున్నాడ‌న్న గుస‌గుస‌లు రెండు రోజుల నుంచే టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.

రాజ‌మౌళి బాలీవుడ్‌లో ఎప్ప‌టి నుంచో ఓ డైరెక్ట్ సినిమా చేయాల‌నుకుంటున్నాడు. హీరో ఎవ‌రు ? అన్న‌ది తెలియ‌క‌పోయినా అమీర్‌ఖాన్‌తో రాజ‌మౌళి సినిమా ఉంటుంద‌న్న ప్ర‌చారం అయితే జ‌రుగుతోంది. ఇక ఆ బాలీవుడ్ హీరో రాజ‌మౌళితో బ‌ల‌మైన లాబీయింగ్ మొద‌లు పెట్టేశాడ‌ట‌. ఆర్ ఆర్ ఆర్‌కు ఇప్పటికే నేష‌న‌ల్ బ‌జ్ వ‌చ్చేయ‌డంతో స‌ద‌రు స్టార్ హీరో సైతం ఎన్ని రోజులు కావాలంటే అన్నీ రోజులు డేట్లు ఇస్తాన‌ని.. నెక్ట్స్ సినిమా నాతోనే చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ విష‌యం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో రెండు, మూడు రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్నా స‌ద‌రు స్టార్ హీరో ఎవ‌ర‌న్న‌ది మాత్రం లీక్ కాలేదు. ఎక్కువ మంది మాత్రం అమీర్‌ఖాన్ పేరు చెపుతున్నారు. అయితే వ‌న్స్ మ‌హేష్‌తో క‌మిట్ అయ్యాక రాజ‌మౌళి త‌న నిర్ణ‌యం మార్చుకోక‌పోవ‌చ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news