రాజ‌మౌళికి భారీ ఆఫ‌ర్ ఇచ్చిన బ‌డా నిర్మాత‌.. క‌ళ్లు చెదిరే డీల్‌…?

టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బాహుబ‌లి రెండు సీరిస్‌ల త‌ర్వాత రాజ‌మౌళి రేంజ్‌, క్రేజ్ ఎక్క‌డికో వెళ్లిపోయాయి. రాజ‌మౌళితో సినిమా చేసేందుకు ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న హీరోలు, బ‌డా బ‌డా నిర్మాత‌లు వెయిటింగ్‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ యంగ్ స్ట‌ర్స్ రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌తో ఆర్ ఆర్ ఆర్ అనే భారీ మ‌ల్టీస్టార‌ర్ సినిమాను తెర‌కెక్కిస్తోన్న రాజ‌మౌళి ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కేఎల్‌. నారాయ‌ణ నిర్మించే సినిమాను డైరెక్ట్ చేస్తాడు. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఈ సినిమాలో హీరో.

 

ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన వెంట‌నే రాజ‌మౌళి ఏ సినిమా చేస్తారు ? అన్న‌ది స‌హ‌జంగానే అంద‌రిలోనూ ఆస‌క్తి ఉంది. మ‌హేష్‌బాబు సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ఖ‌చ్చితంగా బాలీవుడ్ సినిమా చేస్తాడ‌ని అంటున్నారు. రాజ‌మౌళి ఎప్ప‌టి నుంచో బాలీవుడ్ సినిమా చేయాల‌ని అనుకుంటున్నారు. మ‌ధ్య‌లో అమీర్‌ఖాన్‌తో రాజ‌మౌళి సినిమా ఉంటుంద‌న్న వార్త‌లు వ‌చ్చినా అవేవి జ‌ర‌గ‌లేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్ బ‌డా నిర్మాత ఒక‌రు రాజ‌మౌళితో సినిమా ప్లాన్ చేసేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌.

 

హిస్టారిక‌ల్ నేప‌థ్యంలో తెర‌కెక్కే ఈ సినిమా కోసం రాజ‌మౌళికి క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. జ‌క్క‌న్న‌కు రెమ్యున‌రేష‌న్‌తో పాటు బాలీవుడ్‌లో జ‌రిగే బిజినెస్‌లో వాటా ఇస్తాన‌ని క‌ళ్లు చెదిరిపోయే ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఈ ఆఫ‌ర్ మొత్తం విలువ రు. 50 కోట్ల పైమాటే అంటున్నా.. అది ఇంకా ఎక్కువే ఉంటుద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి. ఏదేమైనా ఆర్ ఆర్ ఆర్ ఆ త‌ర్వాత మ‌హేష్ సినిమా కంప్లీట్ చేసేందుకే జ‌క్క‌న్న‌కు మ‌రో రెండేళ్లు ప‌ట్టే ఛాన్సులు ఉన్నాయి.

Leave a comment