Politicsబ్రేకింగ్‌: ఏపీలో జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌లో న‌యా ట్విస్ట్‌

బ్రేకింగ్‌: ఏపీలో జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌లో న‌యా ట్విస్ట్‌

ఏపీలో తాను అధికారంలోకి వ‌స్తే లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లాగా చేస్తాన‌ని సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌లో మ‌రో ముందుడుగు ప‌డింది. ఇప్ప‌టికే ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న 13 జిల్లాల‌ను 25 జిల్లాలుగా చేసేందుకు ఏర్పాటు చేసిన క‌మిటీకి సాయంగా ఇప్పుడు కొన్ని స‌బ్ క‌మిటీలు ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ ప్ర‌ధాన క‌మిటీకి అనుబంధంగా మొత్తం మ‌రో నాలుగు స‌బ్ క‌మిటీలు వేశారు.

ఈ నాలుగు స‌బ్ క‌మిటీల విధులు ఏంటో కూడా చెపుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. స‌బ్ క‌మిటీ 1 జిల్లా బౌండరీలు, నియంత్రణ, లీగల్ వ్యవహారాలు అధ్య‌య‌నం చేస్తే.. రెండో క‌మిటీ నిర్మాణాత్మక, సిబ్బంది పునర్విభజన అధ్యయనానికి… మూడో స‌బ్ క‌మిటీ ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనానికి… నాలుగో క‌మిటీ సంబంధిత పనుల అధ్యయనానికి ఏర్పాటు చేశారు. మ‌ళ్లీ ఈ స‌బ్ క‌మిటీల కింద జిల్లా స్థాయి క‌మిటీలు వేయ‌నున్నారు.

జిల్లా స్థాయి క‌మిటీ చైర్మ‌న్‌గా క‌లెక్ట‌ర్ ఉంటే.. ఆయ‌న‌కు అనుబంధంగా మ‌రో 10 మంది స‌భ్యులు ఉంటారు.  ఇక రాష్ట్రస్థాయి కమిటీకి సహాయంగా ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. ప్రాథమికంగా ఆరు నెలల పాటు ప్రత్యేక ఆఫీస్ కొనసాగుతుందన్న ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేయాలని ఆదేశించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news