Gossipsఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమాకు ఊహించని బ్యాక్‌డ్రాప్‌... పొలిటిక‌ల్ లైన్ వెన‌క...

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమాకు ఊహించని బ్యాక్‌డ్రాప్‌… పొలిటిక‌ల్ లైన్ వెన‌క ట్విస్ట్ ఇదే…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో తెర‌కెక్కే సినిమాపై ఇండస్ట్రీ వ‌ర్గాల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం న‌టిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా త‌ర్వాత ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా సైతం త్రివిక్ర‌మ్ స్టైల్‌కు భిన్నంగా తీశారు. మాస్ మ‌సాలాతో అద‌ర‌గొట్టేశారు. ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ త‌న స్టైల్ అయిన ఫ్యామిలీ స్టోరీతో అల్లు అర్జున్‌తో అల వైకుంఠ‌పురంలో సినిమా తీసి సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టాడు.

 

ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌తో తీసే సినిమా కోసం త్రివిక్ర‌మ్ పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ ఉన్న క‌థాంశం ఎంచుకుంటున్నాడంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. పొలిటిక‌ల్ క‌థాంశం ఎంచుకున్నందునే దానికి సరిపోయే టైటిల్ గా అయినను పోయిరావలె హస్థినకు అనే టైటిల్ కూడా ప్రచారం లోకొచ్చిందంటున్నారు. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఇదేనంటూ సోష‌ల్ మీడియాలో ఓ లైన్ కూడా వైర‌ల్ అవుతోంది. విదేశాల్లో బిజినెస్‌మేన్‌గా ఉండే ఎన్టీఆర్ అనుకోకుండా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఏం చేశాడ‌న్న‌దే ఈ సినిమా క‌థాంశంగా ఉంటుంద‌ని అంటున్నారు.

 

అయితే దీనిపై సినిమా వ‌ర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం.. ఎన్టీఆర్‌తో రెండోసారి సినిమా చేస్తోన్న త్రివిక్ర‌మ్ ఈ సారి రిస్క్ చేయ‌ద‌లుచుకోలేద‌ని.. అస‌లే అల సినిమాతో సూప‌ర్ హిట్టి ఉండ‌డంతో ఈ సారి కూడా త‌న‌కు క‌లిసి వ‌చ్చిన ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్టైన్‌మెంట్ క‌థాంశంతోనే త్రివిక్ర‌మ్ ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నాడ‌ని అంటున్నారు. ఒక పురాతన పాడు బడిన కోటలోని గుప్త నిధుల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తోందని తెలుస్తోంది. మ‌రి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే కాని ఈ సినిమా లైన్ ఏంట‌న్న‌దానిపై పూర్తి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news