Politicsజుట్టు ఇలా రాలుతోందా... బ‌య‌ట‌ప‌డిన మ‌రో 98 క‌రోనా ల‌క్ష‌ణాలు...!

జుట్టు ఇలా రాలుతోందా… బ‌య‌ట‌ప‌డిన మ‌రో 98 క‌రోనా ల‌క్ష‌ణాలు…!

క‌రోనా వైర‌స్ ఇప్ప‌టి వ‌ర‌కు ముక్కు, కంటిలో తుంప‌ర్లు ప‌డ‌డం, నోటి ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని అనుకున్నాం. అలాగే పిత్త‌డం ద్వారా కూడా క‌రోనా సోకుతుంద‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. ఇప్ప‌టి వ‌రకు ద‌గ్గు, జ్వ‌రం, జ‌లుబు, విరేచ‌నాలు, నీర‌సంతో పాటు శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ఉంటే క‌రోనాగా భావించారు. ఈ క్ర‌మంలోనే క‌రోనా మ‌రో ల‌క్ష‌ణం బ‌య‌ట‌ప‌డింది. జ‌ట్టు రాల‌డం కూడా క‌రోనాకు సంకేత‌మ‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

 

ఇండియానా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ కు చెందిన వైద్యులు చేపట్టిన పరిశోధనలో 98 రకాల కరోనా లక్షణాలను గుర్తించారు. 1500 కరోనా పేషంట్లపై పరిశోధ‌న‌ల త‌ర్వాత వీరు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. తీవ్ర న‌రాల నొప్పితో పాటు ఏకాగ్ర‌త్త లేక‌పోవ‌డం.. నిద్ర‌లేమి స‌మ‌స్య‌లు.. చూపు మంద‌గించ‌డంతో పాటు జుట్టు రాల‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా కొత్త‌గా గుర్తించారు. క‌రోనా రోగులు 75 శాతం జ‌ట్టు కోల్పోయార‌ని తేలింది. ఏదేమైనా క‌రోనా రోజు రోజుకు స‌రికొత్త ల‌క్ష‌ణాలు సంత‌రించుకుంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news