Gossipsకాజ‌ల్‌పై మోహ‌న్‌బాబుకు కోపం అందుకేనా... అందుకే ఆమెకు ఛాన్సుల్లేకుండా చేశారా...!

కాజ‌ల్‌పై మోహ‌న్‌బాబుకు కోపం అందుకేనా… అందుకే ఆమెకు ఛాన్సుల్లేకుండా చేశారా…!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ గ‌తంలో వ‌రుస ప్లాపుల్లో ఉన్న‌ప్పుడు య‌మ‌దొంగ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి హిట్ కొట్టాడు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా ద్వారా సరికొత్త ఎన్టీఆర్ ఆవిష్కృతం అయ్యాడు. ఎన్టీఆర్ యంగ్ య‌ముడిగా తెర‌పై విశ్వ‌రూపం చూపించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ప‌క్కన ప్రియ‌మ‌ణి, మ‌మ‌తా మోహ‌న్‌దాస్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమాలో క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు సైతం ఓ కీల‌క పాత్ర‌లో న‌టించాడు.

 

ఈ సినిమాలో హీరోయిన్‌గా రాజ‌మౌళి ముందుగా కాజ‌ల్‌ను తీసుకోవాల‌ని అనుకున్నాడ‌ట‌. అయితే మోహ‌న్‌బాబు వ‌ల్లే ఆమెకు ఈ సినిమా ఛాన్స్ మిస్ అయ్యింద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో ఉన్నాయి. ఇందుకు కార‌ణం ఏంటంటే అంత‌కు ముందే మోహ‌న్‌బాబు పెద్ద కుమారుడు విష్ణు సినిమాలో న‌టించ‌మ‌ని కాజ‌ల్‌ను అడిగితే ఆమె తిర‌స్క‌రించింద‌ట. దీంతో మోహ‌న్‌బాబు ఈ సినిమాలో కాజ‌ల్ ఉంటే తాను న‌టించ‌న‌ని ఖ‌రాఖండీగా చెప్పేయ‌డంతో చివ‌ర‌కు రాజ‌మౌళి మోహ‌న్‌బాబును నొప్పించ‌డం ఇష్టంలేక ప్రియ‌మ‌ణిని తీసుకున్నార‌ట‌.

 

ఆ త‌ర్వాత అదే రాజ‌మౌళి కాజ‌ల్‌ను మ‌గ‌ధీర సినిమాలో తీసుకోగా… ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు ఆ సినిమాలో చేసిన మిత్ర‌వింద పాత్ర ఆమె కెర‌ర్‌లోనే చిర‌స్థాయిగా నిలిచిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news