Gossipsమ‌హేష్ - రాజ‌మౌళి క‌థ లైన్ ఇదే... ఇండ‌స్ట్రీలో బిగ్ హాట్...

మ‌హేష్ – రాజ‌మౌళి క‌థ లైన్ ఇదే… ఇండ‌స్ట్రీలో బిగ్ హాట్ టాపిక్‌…!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే మ‌హేష్‌బాబు సినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. మ‌హేష్ ప్ర‌స్తుతం న‌టిస్తోన్న స‌ర్కారు వారి పాట సినిమా త‌ర్వాత రాజ‌మౌళి సినిమా కోసం రెడీ అవుతాడు. అటు ద‌ర్శ‌క‌ధీరుడు, ఇటు సూప‌ర్‌స్టార్ ఇద్ద‌రి కాంబినేష‌న్ కావ‌డంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ, యావ‌త్ తెలుగు ప్రేక్ష‌కుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాతో బాక్సాఫీస్ బ్రేక్‌, షేక్ అవ్వ‌డం ఖాయం అంటున్నారు.

 

ప్ర‌స్తుతం వీరిద్ద‌రి కాంబినేష‌న్లో వ‌చ్చే సినిమా క‌థ ఎలా ఉంటుంద‌న్న‌దానిపై ఆస‌క్తి చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. మ‌హేష్ కోసం రాజ‌మౌళి ఎలాంటి క‌థ‌ను ఎంచుకుంటాడు ? అని అంద‌రూ ఆస‌క్తితో ఉన్నారు. మ‌హేష్‌ను ల‌వ‌ర్ బాయ్‌గా చూపిస్తాడా ? లేదా యాక్ష‌న్ హీరోగా చూపిస్తాడా ? లేదా ఏదైనా వైవిధ్య‌మైన క‌థ‌తో సినిమా చేస్తాడా ? అన్న‌దే స‌స్పెన్స్‌. గ‌తంలో మ‌హేష్‌తో సినిమా చేస్తే అల్లూరి సీతారామ‌రాజు క‌థ‌తో లేదా జేమ్స్‌బాండ్ స్టైల్ సినిమా చేస్తాన‌ని చెప్పాడు.

 

ఇక ఇప్పుడు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ సైడ్ టాక్ ప్ర‌కారం ఓ యాక్ష‌న్ క‌థాంశంతోనే ఈ సినిమా ఉంటుంద‌ని.. అదిరిపోయే ట్విస్టుల‌తో పాటు బ‌ల‌మైన ప్లాస్ బ్యాక్ కూడా ఉండేలా విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ను రెడీ చేస్తున్నార‌ని అంటున్నారు. ఓవ‌రాల్‌గా రాజ‌మౌళి మ‌హేష్‌ను ల‌వ‌ర్ బాయ్ కంటే యాక్ష‌న్ హీరోగా చూపించేందుకే ఇష్ట‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news