బ్రేకింగ్‌: సీఎం కుమార్తెకు క‌రోనా పాజిటివ్‌.. ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో అల్ల‌క‌ల్లోలం..

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌ముఖుల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు. తాజాగా క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బీఎస్‌. యుడియార‌ప్పకు ఆదివారం కోవిడ్ -19 పాజిటివ్ అన్న‌ది నిర్దార‌ణ కాగా ఇప్పుడు ఆయ‌న కుమార్తెకు సైతం క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు తేలింది. అటు సీఎంతో పాటు ఆయ‌న కుమార్తెకు సైతం కోవిడ్‌-19 నిర్దార‌ణ కావ‌డంతో ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేగింది. ఇప్ప‌టికే సీఎంను గ‌త కొన్ని రోజులుగా క‌లిసిన వారు అంద‌రూ కోవిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు. ఇక యుడియార‌ప్ప ఇప్ప‌టికే బెంగ‌ళూరులోని మ‌ణిపాల్ హాస్ప‌ట‌ల్లో చికిత్స తీసుకుంటుండ‌గా.. ఇప్పుడు ఆయ‌న కుమార్తెను సైతం అదే హాస్ప‌ట‌ల్లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు.

 

ముఖ్య‌మంత్రి ఆరోగ్యం అయితే నిల‌క‌డ‌గా ఉన్న‌ట్టు ఆసుప‌త్రి, ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఇక తనకు కరోనా సోకినట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించిన 77 ఏళ్ల సీఎం యెడియూరప్ప.. ఇటీవల తనను కలిసినవారు కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని, హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. ఇక కోవిడ్ సోకిన ప్ర‌ముఖుల్లో త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ భ‌న్వ‌రీలాల్ పురోహిత్ ఉండ‌గా… మధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు సైతం క‌రోనా వ‌చ్చింది. ఇక క‌రోనాతో యూపీ విద్యాశాఖా మంత్రి కమ‌లారాణితో పాటు ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల‌రావు ఆదివారం మృతిచెందిన సంగ‌తి విదిత‌మే.

Leave a comment