Politicsక‌రోనా ట్యాబ్లెట్లు రు. 35, రు. 49కే... ప్ర‌పంచంలోనే చ‌వ‌కైన చికిత్స...

క‌రోనా ట్యాబ్లెట్లు రు. 35, రు. 49కే… ప్ర‌పంచంలోనే చ‌వ‌కైన చికిత్స ఇదే..

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుక్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు, ట్రయల్స్ కొనసాగుతున్నాయి. దాదాపు 200కు పైగా దేశాల్లో గత రెండు మూడు నెల‌లుగా ఈ ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి టైంలో మ‌న దేశంలో ముంబై కేంద్రంగా ప‌ని చేస్తోన్న ప్ర‌ముఖ ఫార్మా కంపెనీలు లుపిన్ ఫార్మా, స‌న్ ఫార్మా కోవిడ్ చికిత్స కోసం అత్యంత చ‌వ‌కగా రెండు ట్యాబ్లెట్లు తీసుకువ‌చ్చాయి. ఇప్ప‌టికే కరోనా బాధితుల చికిత్సలో పనిచేసే యాంటీ వైరల్ డ్రగ్ పావిపిరవిర్‌ ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఇప్పుడు ఈ పావిపిర‌విర్‌కు జ‌న‌రిక్ వెర్ష‌న్‌ను కోవిహాల్ట్ పేరుతో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు లుపిన్‌ ప్రకటించింది. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ. 49గా ఉంటుందని వెల్లడించింది. ఇక సన్‌ఫార్మా కూడా పావిపిరవిర్‌కు జెనరిక్ వెర్షన్‌నుగా ఫ్లూగార్డ్‌ ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ.35గా ఉంటుందని సన్ ఫార్మా తెలిపింది. కరోనా చికిత్సలో ఇదే అత్యంత చవకైన మెడిసిన్‌ అని పేర్కొంది. ఏదేమైనా ఈ రెండు ట్యాబెట్లు కోవిడ్ రోగుల విష‌యంలో ప్ర‌భావంత‌గా ప‌నిచేస్తే చాలా మందికి పెద్ద ఉప‌శ‌మ‌న‌మే అనుకోవ‌చ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news