Moviesఅస‌భ్య‌క‌ర పోస్టులు... క‌త్తి మ‌హేష్ అరెస్టు

అస‌భ్య‌క‌ర పోస్టులు… క‌త్తి మ‌హేష్ అరెస్టు

టాలీవుడ్ సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయ‌న గ‌త కొంత‌కాలంగా వ్య‌క్తం చేస్తోన్న అభిప్రాయాల్లో కొన్ని వివాస్ప‌దంగా మారుతున్నాయి. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో క‌త్తి పెట్టిన పోస్టులు.. చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంతో క‌త్తి వ‌ర్సెస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌కు మ‌ధ్య పెద్ద వార్ న‌డిచింది. ఆ త‌ర్వాత ప‌లు హిందు సంస్థ‌ల‌తో పాటు అటు టీడీపీ ఫాలోవ‌ర్స్‌కు సైతం క‌త్తి టార్గెట్ అవుతూ వ‌స్తున్నారు. తాజాగా క‌త్తి శ్రీరాముడిపై అసభ్యకర పోస్ట్‌లు పెట్టిన నేప‌థ్యంలో ఆయ‌న్ను అరెస్టు చేసిన పోలీసులు ఉస్మానియాలో వైద్య పరీక్ష‌లు చేసి అనంత‌రం నాంపల్లి హైకోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.

 

క‌త్తి కొద్ది రోజుల క్రిత‌మే శ్రీరాముడిపై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్ట‌డంతో అవి వివాదంగా మార‌డంతో పాటు ప‌లు హిందూ సంఘాలు తీవ్రంగా ఆందోళ‌న చేశాయి. చివ‌ర‌కు క‌త్తిని పోలీసులు ప‌లుసార్లు విచారించి.. ఈ రోజు అరెస్టు చేశారు. ఇక గ‌తంలో ఓ సారి క‌త్తి మ‌హేష్‌పై హైద‌రాబాద్‌లో దాడి జ‌రిగింది. ఈ దాడి వెన‌క ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నార‌ని కూడా క‌త్తి విమ‌ర్శించారు. ఇటీవల ఆర్జీవీ డైరెక్ట్ చేసిన పవర్ స్టార్ సినిమాల్లోనూ నటించారు కత్తి మహేష్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news