Moviesఆ స్టార్ హీరోకు భార్య దూర‌మ‌వ్వ‌డానికి అదే కార‌ణ‌మా... బాంబు పేల్చిన...

ఆ స్టార్ హీరోకు భార్య దూర‌మ‌వ్వ‌డానికి అదే కార‌ణ‌మా… బాంబు పేల్చిన హీరోయిన్‌

సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత ఈ ఇష్యూలోకి కొత్త‌గా డ్ర‌గ్స్ ఉదంతం కూడా వ‌చ్చింది. ఇక ఈ కేసులో ముందు నుంచి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తోన్న బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ సైతం తాజాగా బాలీవుడ్ హీరోల డ్ర‌గ్స్ వాడ‌కం గురించి సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది. ఓ జాతీయ మీడియా ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కంగ‌న గ‌తంలో డేట్ చేసిన ఓ హీరో గురించి పెద్ద బాంబు పేల్చింది. స‌ద‌రు టాప్ హీరో ఎక్కువ మొతాదులో డ్ర‌గ్స్ తీసుకుంటాడ‌ని ఆమె చెప్పింది.

అలా ఎక్కువ మోతాదులో డ్ర‌గ్స్ తీసుకోవ‌డం వ‌ల్ల అత‌డి ఆరోగ్యం క్షీణించి హాస్ప‌ట‌ల్లో చేరాడ‌ని.. ఈ అల‌వాట్లు భ‌రించ‌లేక‌, అత‌డి టార్చ‌ర్ త‌ట్టుకోలేకే అత‌డి భార్య అత‌డి నుంచి విడిపోయింద‌ని కంగ‌న చెప్పింది. ఇక స‌ద‌రు టాప్ హీరో భార్య నుంచి విడిపోయాక అత‌డితో తాను డేటింగ్ చేశానని అయితే అతడి ఫ్యామిలీ తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందని కంగన చెప్పింది. ఇక బాలీవుడ్ హీరోల్లో 99 శాతం మందికి డ్ర‌గ్స్ తీసుకునే అల‌వాటు ఉంద‌ని కూడా చెప్పింది.

ఇక కంగ‌న చెప్పిన హీరో హృతిక్ రోష‌నే అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. హృతిక్ అత‌డి భార్య సుజానేఖాన్ నుంచి విడిపోయాకే కంగ‌న అత‌డితో డేట్ చేసింది. కొన్నేళ్ల పాటు వీరు క‌లిసే ఉన్నారు. ఆ త‌ర్వాతే వీరి మ‌ధ్య గ్యాప్ రావ‌డంతో విడిపోయిన సంగ‌తి తెలిసిందే.  అప్ప‌టి నుంచి హృతిక్‌ను ఆమె ప‌దే ప‌దే టార్గెట్ చేస్తూ వ‌స్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news