Moviesజాన్వీక‌పూర్‌ను అంత‌లా హార్ట్ చేశారా... !

జాన్వీక‌పూర్‌ను అంత‌లా హార్ట్ చేశారా… !

దివంగ‌త అందాల సుంద‌రి శ్రీదేవి కుమార్తె జాన్వీక‌పూర్ న‌టించిన గుంజ‌న్ స‌క్సేనా మూవీ భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ నెల 12న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది. కార్గిల్ వార్‌లో పాల్గొన్న తొలి ఇండియ‌న్ ఫోర్స్ ఫైలెట్ గుంజ‌న్ స‌క్సేనా జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమా విడుద‌ల‌కు ముందు మంచి హైప్ తెచ్చుకుంది. అయితే రిలీజ్ అయ్యాక అటు విమ‌ర్శ‌కుల‌తో పాటు ఇటు సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా పెద‌వి విరుస్తున్నారు.

సినిమాలో విష‌యం లేద‌న్న రివ్యూల‌తో పాటు, నెటిజ‌న్ల ట్రోలింగ్‌లు, యాంటీ కామెంట్ల‌తో సోష‌ల్ మీడియా ద‌ద్దరిల్లుతోంది. తాను ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ సినిమా చేసినా ప్రేక్ష‌కులు తిర‌స్క‌రించ‌డం ఓ బాధ అయితే.. ఇటు భ‌యంక‌ర‌మైన ట్రోలింగ్‌లు, నెగిటివ్ రివ్యూలు ఆమెను మ‌రింత బాధ‌పెట్టాయంటున్నారు. ఇక వీటిని చూసి జాన్వీ తండ్రి బోనీక‌పూర్ సైతం అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఏదేమైనా గుంజ‌న్ స‌క్సెనా ఫెయిల్యూర్ నేప‌థ్యంలో వ‌చ్చిన ట్రోలింగ్స్ జాన్వీని బాగా హ‌ర్ట్ చేశాయ‌నే తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news