Politicsఖ‌మ్మం జిల్లాలో వింత పెళ్లి... కులాంత‌ర వివాహంలో కొత్త ట్విస్ట్‌...

ఖ‌మ్మం జిల్లాలో వింత పెళ్లి… కులాంత‌ర వివాహంలో కొత్త ట్విస్ట్‌…

శ్రావణం రాగానే పెళ్లిళ్ల సందడి మొదలైంది. కరోనా ప్రభావం పెరుగుతున్నా… చాలా మంది మాత్రం పెళ్లిళ్లు సింపుల్‌గా చేసేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఖ‌మ్మం జిల్లాలో ఈ లాక్ డౌన్ వేళ రెండు వేర్వేరు మ‌తాల‌కు చెందిన ప్రేమికుల మ‌ధ్య వింత వివాహం జ‌రిగింది. జిల్లాలోని అన్నారుగూడెంలో ఓ క్రైస్త‌వ మ‌తానికి చెందిన అబ్బాయి, ముస్లిం మ‌తానికి చెందిన అమ్మాయి ప్రేమించుకున్నారు. గ‌త మూడేళ్లుగా వీరి మ‌ధ్య ప్రేమాయ‌ణం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే లాక్‌డౌన్ వేళ వీరిద్ద‌రు త‌మ మ‌తాల‌కు చెందిన సంప్ర‌దాయంలో కాకుండా హిందూమ‌త సంప్ర‌దాయంలో పెళ్లి చేసుకున్నారు.

 

వాస్త‌వంగా వీరి సంప్ర‌దాయం ప్ర‌కారం వీరి పెళ్లి చర్చిలో.. లేదంటే మసీదులో జరగాలి. అలా కాకుండా హిందూ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో చేసుకున్నారు. వీరిద్దరూ భిన్న మతాలకు చెందిన వారు కావడంతో.. ఆదర్శంగా నిలవడం కోసం పెళ్లికి హిందూ సంప్రదాయాన్ని ఎంచుకున్నారు. దీంతో ఆదివారం హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news