Moviesమ‌హేష్‌బాబుతో న‌టించాల‌నుంది.. సీనియ‌ర్ హీరోయిన్ కోరిక‌

మ‌హేష్‌బాబుతో న‌టించాల‌నుంది.. సీనియ‌ర్ హీరోయిన్ కోరిక‌

నిన్న‌టి త‌రం హీరోయిన్ భానుప్రియ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆమె గుండ్ర‌ని మొహం… హీరోల‌తో పోటీప‌డి మ‌రీ చేసే డ్యాన్సులు.. ఆమె హావ‌భావాలు ఇలా చెప్పుకుంటూ పోతే భానుప్రియ‌కు అప్ప‌ట్లో తిరుగులేని క్రేజ్ ఉండేది. ఆ త‌ర్వాత ఆమె తెలుగులో ఇప్ప‌టి హీరోల‌కు అమ్మ‌గా కూడా న‌టించి మెప్పించ‌డంతో పాటు బుల్లితెర‌పై కూడా ఎంట్రీ ఇచ్చింది. భానుప్రియ త‌న తాజా ఇంట‌ర్వ్యూలో మ‌న టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌కు ఈ త‌రం హీరోల్లో మ‌హేష్‌బాబు అంటే చాలా ఇష్ట‌మ‌ని.. మ‌హేష్ లుక్‌, న‌ట‌న చాలా బాగుంటుంద‌ని ఆకాశానికి ఎత్తేసింది.

తాను మ‌హేష్ సినిమాలు చూస్తాన‌ని.. మ‌హేష్ న‌టిస్తుంటే అస‌లు అది యాక్టింగ్‌లా కాకుండా చాలా నేచుర‌ల్‌గా ఉంటుంద‌ని భానుప్రియ చెప్పారు. ఇక త‌న‌కు అవ‌కాశం వ‌స్తే మ‌హేష్‌తో న‌టిస్తాన‌ని కూడా ఆమె ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 1980-1993 మధ్య కాలంలో హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించి ఓ వెలుగువెలిగారు భానుప్రియ. తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషలలో దాదాపు 110 చిత్రాలలో ఆమె నటించారు. తెలుగులో అగ్ర హీరోలంద‌రితోనూ ఆమె న‌టించి హిట్లు కొట్టారు. భ‌ర‌త‌నాట్యంలో భానుప్రియ పెట్టింది పేరు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news