నా స్నేహితుల‌కు సుఖం ఇవ్వూ… ఈ నీచుడు భార్య‌ను ఏం చేశాడంటే…!

స‌మాజంలో రోజు రోజుకు మాన‌వ సంబంధాలు ఎంత‌గా దిగ‌జారుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఓ నీచుడు అయితే అగ్నిసాక్షిగా పెళ్లాడిన త‌న భార్య‌ను ఏకంగా త‌న స్నేహితుల‌తో గ‌డ‌పాలంటూ హింస‌కు గురి చేశారు. గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ న‌గ‌రంలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. స‌ద‌రు దుర్మార్గుడు అయిన భ‌ర్త త‌న భార్య‌ను అద‌న‌పు క‌ట్నంతో పాటు స్నేహితుల‌తో కూడా గ‌డ‌పాల‌ని ఒత్తిడి చేశాడు. ఆ దుర్మార్గుడు ఇత‌ర మ‌హిళ‌ల‌తో అక్ర‌మ సంబంధాలు పెట్టుకోవ‌డంతో పాటు త‌న భార్య‌ను నా స్నేహితులు నీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు… వారికి ప‌క్క సుఖం ఇవ్వాలంటూ వేధించ‌సాగాడు.

 

గుజరాత్‌లోని అహ్మ‌దాబాద్‌కు చెందిన ఓ వ్య‌క్తి అదే ప్రాంతానికి చెందిన మ‌హిళ‌ను 2002 లో వివాహం చేసుకున్నారు. కట్నంగా 50 తులాల బంగారాన్ని ఇచ్చారు. వివాహం జరిగిన ఆరు నెలల తరువాత, అదనపు కట్నంతో పాటు మ‌రో కారు కావాల‌ని వేధిస్తుండ‌డంతో ఆమె కుటుంబ స‌భ్యులు అత‌డు అడిగిన‌వి అన్నీ ఇచ్చారు. అయినా అత‌డు త‌న ప్ర‌వ‌ర్త‌న మాత్రం మార్చుకోలేదు. త‌న విపరీత బుద్ధి బ‌య‌ట పెట్టుకున్నాడు. త‌న స్నేహితుల‌తో గ‌డ‌పాల‌ని ఆమెపై ఒత్తిడి తేవ‌డంతో విసిగిపోయిన ఆమె అహ్మదాబాద్‌ మహిళా పోలీసులను ఆశ్రయించారు.

 

తన భర్త ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకొని, తనను ఆయన స్నేహితులతో గడపాలంటూ ఒత్తిడి చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

Leave a comment