Gossipsక్లైమాక్స్‌లో బిగ్ ట్విస్ట్‌.. చివ‌రి నిమిషంలో ఆ ముద్దుగుమ్మ ఎంట్రీ

క్లైమాక్స్‌లో బిగ్ ట్విస్ట్‌.. చివ‌రి నిమిషంలో ఆ ముద్దుగుమ్మ ఎంట్రీ

బిగ్‌బాస్ రియాల్టీ తెలుగు సీజ‌న్ 4 మ‌రో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ షో కోసం తెలుగు ప్రేక్ష‌కులు ఉత్కంఠ‌తో వెయిటింగ్‌లో ఉన్నారు. లాక్‌డౌన్‌, క‌రోనా స‌మ‌యంలో బిగ్‌బాస్ త‌మ‌కు పెద్ద రిలీప్ ఇస్తుంద‌ని భావిస్తున్నారు. వంద రోజుల పాటు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఈ షో టీవీల‌కు క‌ట్టి ప‌డేయ‌నుంది. ఇక షో కంటెస్టెంట్లు ఇప్ప‌టికే క్వారంటైన్‌లో ఉన్న వేళ్ల క్లైమాక్స్‌లో అదిరే ట్విస్టులు రివీల్ అవుతున్నాయి.

ఓ ముద్దుగుమ్మ హీరోయిన్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తోంద‌ట‌. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సుడిగాడు – బ్రదర్ అఫ్ బొమ్మాలి సినిమాల్లో హీరోయిన్ గా మెప్పించిన మోనాల్ గజ్జర్ ఎవరూ ఊహించని రీతిలో బిగ్‌బాస్ కంటెస్టెట్ల‌లో చివ‌రి నిమిషంలో చోటు ద‌క్కించుకున్న‌ట్టు తెలిసింది. ఆమె ఈ రెండు సినిమాల్లో త‌న చ‌లాకీ త‌నంతో పాటు, ప్రేక్ష‌కుల‌ను అభిన‌యంతో క‌ట్టి ప‌డేసింది.

ఇక ఇప్పుడు మోనాల్ గ‌జ్జ‌ర్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే అది హౌస్‌కు ఎట్రాక్ష‌న్ రావ‌డంతో పాటు ప్ల‌స్ అవుతుంద‌ని స్టార్ మా నిర్వాహ‌కులు భావిస్తున్నారు. హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న ఈ గుజ‌రాత్ బ్యూటీ ఇప్ప‌టికే హైద‌రాబాద్‌కు వ‌చ్చేసింద‌ట‌. ఆమెకు క‌రోనా ప‌రీక్ష‌లు చేసి హౌస్‌లోకి పంపుతార‌ని టాక్‌..?  మ‌రి మోనాల్ హౌస్‌లో త‌న చేష్ట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎలా క‌ట్టి ప‌డేస్తుందో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news