Gossipsబ‌న్నీ - కొర‌టాల సినిమాలో క్రేజీ హీరోయిన్‌... థియేట‌ర్ల‌లో విజిల్స్ ఆగ‌వ్‌..!

బ‌న్నీ – కొర‌టాల సినిమాలో క్రేజీ హీరోయిన్‌… థియేట‌ర్ల‌లో విజిల్స్ ఆగ‌వ్‌..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సంక్రాంతికి వ‌చ్చిన అల వైకుంఠ‌పుములో సినిమా త‌ర్వాత వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల‌తో దూసుకు పోతున్నాడు. ఈ సినిమా బ‌న్నీకి పాన్ ఇండియా రేంజ్ ఉంద‌ని ఫ్రూవ్ చేసింది. ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమాలో నటిస్తోన్న బ‌న్నీ ఆ వెంట‌నే మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ కొరటాల శివ‌ను లైన్లో పెట్టేశాడు. పుష్ప షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో వెంట‌నే కొర‌టాల ప్రాజెక్టును ప‌ట్టాలెక్కించేయ‌నున్నాడు.

ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే ప్లాన్ చేస్తున్నారు. వ‌రుస‌గా పాన్ ఇండియా ప్రాజెక్టుల‌తో బ‌న్నీ ఇండియా వైడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి కూడా లేటెస్ట్ గా మ‌రో అదిరిపోయే మ్యాట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాలీవుడ్ మార్కెట్ నేప‌థ్యంలో ఉండేలా కొర‌టాల క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడ‌ట‌. ఇక సినిమాలో క్యాస్టింగ్ కూడా ఎక్కువుగా ఉంటుంద‌ని.. ఇక హీరోయిన్ విష‌యంలో కూడా ఓ క్లారిటీకి వ‌చ్చార‌ని అంటున్నారు.

ఈ క్రేజీ ప్రాజెక్టులో ఖచ్చితంగా బాలీవుడ్ హీరోయిన్‌ను మాత్ర‌మే తీసుకోవాల‌ని కొర‌టాల స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యార‌ట‌. బాలీవుడ్ హీరోయిన్ ఉంటేనే సినిమాకు అక్క‌డ క్రేజ్ వ‌స్తుంద‌న్న‌దే వీరి ప్లాన్. ఆలియాభ‌ట్, కైరా అద్వానీతో పాటు మ‌రో ఒక‌రిద్ద‌రు స్టార్ హీరోయిన్ల‌లో ఎవ‌రో ఒక‌రిని ఎంపిక చేసుకుని ఇప్పుడే అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోవాల‌ని కొర‌టాల చూస్తున్నాడు. ఇక బ‌న్నీ ప‌క్క‌న బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అంటే థియేట‌ర్ల‌లో ఎంత ర‌చ్చ ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news