బ్రేకింగ్‌: క‌రోనా మ‌ర‌ణాల్లో మ‌రో రికార్డు సృష్టించిన ఇండియా

క‌రోనా మ‌ర‌ణాల్లో మ‌న‌దేశంలో మ‌రో రికార్డుకు అతి చేరువ‌లో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న డేటాను బ‌ట్టి చూస్తే గ‌త 24 గంట‌ల్లో క‌రోనా కేసులు కొత్త‌గా 53 వేలు న‌మోదు అయ్యాయి. 871 మంది మృతిచెందారు. గ‌త 24 రోజుల్లోనే కోవిడ్‌-19 కేసులు 10 ల‌క్ష‌ల నుంచి 22 ల‌క్ష‌ల‌కు పెరిగాయి. స‌గ‌టున రోజుకు 60 వేల కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి. రిక‌వ‌రీ రేటు 70 శాతంగా ఉంది.

 

దేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య లక్షకు చేరుకోవడానికి 110 రోజులు పట్టింది. కేసుల సంఖ్య 2 లక్షలకు చేరుకోవడానికి 14 రోజులు పట్టింది. 18 రోజుల్లో మొత్తం కేసుల సంఖ్య 4 లక్షలకు చేరుకుంది. కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో ఒక్కో రాష్ట్రంలో 2000 కుపైగా మృతిచెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా మృతులు 45 వేలు దాట‌గా.. ఇది త్వ‌ర‌లోనే 50 వేల మార్క్ చేరుకోనుంది.