ముగ్గురు మంత్రుల‌కు క‌రోనా పాజిటివ్‌

క‌రోనా మ‌హ‌మ్మారి రాజ‌కీయ నాయ‌కుల‌ను వ‌ద‌ల‌డం లేదు. ఈ క్ర‌మంలోనే తాజాగా బీజేపీ ఎంపీ సుమేర్ సింగ్ సోలంకికి ( రాజ్య‌స‌భ‌) కొవిడ్ -19 సోకింది. ఎంపీ సోలంకీకి గత కొన్ని రోజులుగా జ్వరం వస్తుండటంతో ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఈ క్ర‌మంలోనే సోలంకికి కోవిడ్ ఎటాక్ అయిన‌ట్టు తేలింది. ఈ విష‌యాన్ని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బర్వానీ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అనితా సింగారే చెప్పారు. ఎంపీ సోలంకికి కరోనా సోకడంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వ‌చ్చిన ఎంపీల సంఖ్య 2కు చేరుకుంది.

 

ఇక జూన్ నెలలో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సోలంకి, జ్యోతిరాదిత్య సింథియాలకు కరోనా వచ్చింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మతో పాటు ఏకంగా ముగ్గురు మంత్రులు, ప‌లువురు కాంగ్రెస్‌, బీజేపీ ఎమ్మెల్యేల‌కు కూడా క‌రోనా వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే మ‌హారాష్ట్ర‌, ఏపీ, తెలంగాణ‌లోని ప‌లువురు ఎమ్మెల్యేల‌కు సైతం క‌రోనా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Leave a comment