Politicsజ‌గ‌న్‌కు చంద్ర‌బాబు 48 గంట‌ల డెడ్‌లైన్‌... దిమ్మ‌తిరిగే స‌వాల్‌

జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు 48 గంట‌ల డెడ్‌లైన్‌… దిమ్మ‌తిరిగే స‌వాల్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏపీ సీఎం జ‌గ‌న్‌కు 48 గంట‌ల డెడ్‌లైన్ విధించారు. జ‌గ‌న్‌కు దమ్ముంటే అసెంబ్లీని ర‌ద్దు చేస్తే ఎన్నిక‌ల‌కు వెళ‌దామ‌ని.. ప్ర‌జాక్షేత్రంలోనే ఎవ‌రేంటో తేల్చుకుందామ‌ని స‌వాల్ విసిరారు. రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ విష‌యంపై హైద‌రాబాద్ నుంచి మీడియాతో మాట్లాడిన ఆయ‌న జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఎన్నిక‌ల ముందు రాజ‌ధాని మార్చుతామ‌ని జ‌గ‌న్ ఎక్క‌డా చెప్ప‌లేదు. మీకు మూడు రాజ‌ధానుల విష‌యంలో సౌత్ ఆఫ్రికా ఆద‌ర్శ‌మా ? ఎందుకు ఆద‌ర్శం అని బాబు ఫైర్ అయ్యారు. ఇక 5 ఏళ్ల‌కు ఓట్లు వేశార‌ని రాష్ట్ర భ‌విష్య‌త్తును నాశ‌నం చేస్తున్నారని బాబు ఫైర్ అయ్యారు. ఇక జ‌గ‌న్‌కు తాను ఇచ్చిన స‌వాల్ మీరు స్వీక‌రిస్తారా ? రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వెన్ను పోటు పొడుస్తారా ? అన్న‌ది ఆయ‌న‌ నిర్ణ‌యించుకోవాల‌ని బాబు అన్నారు.

 

మేం రాజీనామా చేయ‌డం నిమిషం ప‌ని అని అన్న ఆయ‌న… రాజ‌ధాని విష‌యంలో కోర్టుల‌కు వెళ్ల‌డం.. న్యాయ పోరాటం ఒక యాంగిల్ అయితే.. తాము ప్ర‌జా పోరాటం చేసి.. ప్ర‌జా కోర్టులో వైసీపీ ప్ర‌భుత్వాన్ని దోషిగా నిల‌బెట్టే బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని బాబు అన్నారు. ఇక అసెంబ్లీని ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళితే వైఎస్సార్‌సీపీ గెలిస్తే తాము రాజ‌ధాని విష‌యంలో మాట్లాడం అని కూడా చంద్ర‌బాబు చెప్పారు. ఇక వైసీపీ వాళ్లు అమ‌రావ‌తి రైతుల‌కు తాము అన్యాయం చేయ‌డం లేద‌ని చెపుతున్నార‌ని.. మూడు రాజ‌ధానుల్లో అమ‌రావ‌తి ఒక రాజ‌ధానిగా ఉంచుతున్నామ‌ని అంటున్నారు క‌దా ? అని ప్ర‌శ్నిస్తే జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు ముందు ఒక‌లా.. ఎన్నిక‌ల త‌ర్వాత మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌జ‌ల‌ను మోసం చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రి బాబు డెడ్‌లైన్‌కు జ‌గ‌న్ నుంచి ఎలాంటి రియాక్ష‌న్ వ‌స్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news