Gossipsబ్రేకింగ్‌: బిగ్‌బాస్ 4 డేట్ వచ్చేసింది... ఆ రోజు నుంచే...

బ్రేకింగ్‌: బిగ్‌బాస్ 4 డేట్ వచ్చేసింది… ఆ రోజు నుంచే బుల్లితెర ర‌చ్చే

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కులు ఎన్నో క‌ళ్ల‌తో వెయిట్ చేస్తోన్న తెలుగు బుల్లితెర పాపుల‌ర్ షో బిగ్‌బాస్ 4 సీజ‌న్ ఈ నెలాఖ‌రులోనే ప్రారంభ‌మ‌వుతుంద‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు వార్త‌లు వ‌చ్చాయి. ఇప్ప‌టికే నాగార్జున ప్రోమోల‌తో ఉత్కంఠ పెంచేస్తున్నారు. మ‌రోవైపు కంటెస్టెంట్ల పేర్ల‌తో పాటు వీరు హోం క్వారంటైన్‌లో ఉన్నార‌న్న వార్త‌ల‌తో షో డేట్ ఎప్పుడు వ‌స్తుందా ? అని ఒక్క‌టే టెన్ష‌న్ బుల్లితెర ప్రేక్ష‌కుల్లో ప్రారంభ‌మైంది. నాగార్జున పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆగ‌స్టు 29 లేదా 30 న బిగ్‌బాస్ తెలుగు వెర్ష‌న్ సీజ‌న్ 4 ప్రారంభం కావ‌డం ప‌క్కా అని నిన్న‌టి వ‌ర‌కు చ‌ర్చ‌లు న‌డిచాయి.

 

అయితే హౌస్‌లోకి వెళ్లేవారిలో ఓ కంటెస్టెంట్‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఇప్పుడు ఆ కంటెస్టెంట్‌కు ట్రీట్మెంట్ న‌డుస్తోంద‌ట‌. స‌ద‌రు కంటెస్టెంట్‌కు వారం రోజుల త‌ర్వాత మ‌రోసారి కోవిడ్ టెస్టులు చేయ‌నున్నారు. అప్పుడు ప‌రీక్ష‌ల్లో నెగిటివ్ వ‌స్తే ఆ కంటెస్టెంట్‌ను హౌస్‌లోకి పంపుతారు. లేనిప‌క్షంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం సిద్ధం చేసిన ఇద్ద‌రు కంటెస్టెంట్ల‌లో ఒక‌రిని హౌస్‌లోకి ఎంట్రీ చేయిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ కంటెస్టెంట్‌కు క‌రోనా సోక‌వ‌డంతో ఈ నెల 30న ప్రారంభం కావాల్సిన బిగ్‌బాస్ 4 కాస్తా సెప్టెంబర్‌ మొదటి వారంకు వెళ్లిపోయింది.

 

ఇక విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం సెప్టెంబ‌ర్ 4 లేదా 5న షో ప్రారంభ‌మ‌వుతుంద‌ని అంటున్నారు. ఇక గ‌తంతో పోలిస్తే ఈ సారి కోవిడ్ నిబంధ‌న‌ల నేప‌థ్యంలో బిగ్‌బాస్ 4ను మ‌రింత క‌ఠిన నిబంధ‌న‌ల‌తో నిర్వ‌హించ‌నున్నారు. ఈ సీజన్‌లో టీవీ-9 దేవి, డ్యాన్స్‌ మాస్టర్‌ రఘు, అతని భార్య ప్రణవి (సింగర్‌), గంగవ్వ, జబర్దస్త్‌ కెవ్వు కార్తీక్‌, సింగర్ నోయల్‌ సేన్‌, యాంకర్లు లాస్య, అరియానా, నటులు కరాటే కళ్యాణి, సురేఖా వాణి, పూనమ్ బజ్వా, పూజిత పొన్నాడ, యూట్యూబర్లు అలేఖ్య హారిక, మహబూబ్ దిల్‌ సే ఉండబోతున్నట్లు సమాచారం

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news